ఏసీబీకి చిక్కిన ప్రైవేట్ శానిటరీ జవాన్
దిశ, వరంగల్ తూర్పు : వరంగల్ మహానగర పాలక సంస్థలో ప్రైవేట్ శానిటరీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్న సండ్ర మధు శుక్రవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు చిక్కాడు. హన్మకొండ ప్రాంతంలో లేడీస్ ఎంపోరియం ఏర్పాటు చేసేందుకు సుంకరి ప్రశాంత్ బల్దియాకు దరఖాస్తు చేసుకున్నారు. లైసెన్స్ కోసం మధు రూ.2వేలు డిమాండ్ చేయడంతో ప్రశాంత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు శుక్రవారం మధుకు ఫోన్‌చేసి హన్మకొండలోని ఏషియన్ మాల్ సమీపంలోకి రావాల్సిందిగా కోరారు. సాయంత్రం నాలుగు […]
దిశ, వరంగల్ తూర్పు : వరంగల్ మహానగర పాలక సంస్థలో ప్రైవేట్ శానిటరీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్న సండ్ర మధు శుక్రవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు చిక్కాడు. హన్మకొండ ప్రాంతంలో లేడీస్ ఎంపోరియం ఏర్పాటు చేసేందుకు సుంకరి ప్రశాంత్ బల్దియాకు దరఖాస్తు చేసుకున్నారు. లైసెన్స్ కోసం మధు రూ.2వేలు డిమాండ్ చేయడంతో ప్రశాంత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు శుక్రవారం మధుకు ఫోన్‌చేసి హన్మకొండలోని ఏషియన్ మాల్ సమీపంలోకి రావాల్సిందిగా కోరారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న మధుకు రూ.2వేలు ఇస్తుండగా అక్కడే పొంచివున్న ఏసీబీ అధికారులు రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు.