ఐస్‌క్రీమ్ సెల్లర్ టు సబ్ ఇన్‌స్పెక్టర్‌.. ఇన్‌స్పైరింగ్ ఉమన్ !

దిశ, ఫీచర్స్ : కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి.. బిడ్డ పుట్టిన ఆర్నెళ్లకే వదిలేసిన భర్త.. 18 ఏళ్లకే చంకన పసిబిడ్డతో రోడ్డునపడ్డ జీవితం.. ఏ ఒక్కరి సపోర్ట్ లేదు, ఎలా బతకాలో తెలియదు. అయినా అదరలేదు, బెదరలేదు. ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుని పోషణ కోసం రకరకాల పనులు చేసింది. కానీ అవేవీ తన ఎదుగుదలకు సాయపడలేదు. ఈ క్రమంలోనే ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని, పట్టుదలతో చదివి నేడు సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదిగి.. ఎంతో మంది మహిళలకు […]

Update: 2021-06-28 02:31 GMT

దిశ, ఫీచర్స్ : కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి.. బిడ్డ పుట్టిన ఆర్నెళ్లకే వదిలేసిన భర్త.. 18 ఏళ్లకే చంకన పసిబిడ్డతో రోడ్డునపడ్డ జీవితం.. ఏ ఒక్కరి సపోర్ట్ లేదు, ఎలా బతకాలో తెలియదు. అయినా అదరలేదు, బెదరలేదు. ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుని పోషణ కోసం రకరకాల పనులు చేసింది. కానీ అవేవీ తన ఎదుగుదలకు సాయపడలేదు. ఈ క్రమంలోనే ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని, పట్టుదలతో చదివి నేడు సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదిగి.. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన కేరళ ఉమెన్ సక్సెస్ జర్నీ విశేషాలు.

కేరళలోని వర్కలకు చెందిన అనీ శివ.. కుటుంబ సభ్యులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొడుకు పుట్టిన కొద్ది రోజులకే భర్త వదిలేయడంతో రోడ్డున పడింది. ఈ క్రమంలో వర్కల శివగిరి ఆశ్రమంలో ఆశ్రయం పొందిన తను.. నిమ్మరసం, ఐస్‌క్రీమ్స్ నుంచి హ్యాండ్‌క్రాఫ్ట్ విక్రయించడం వరకు చిన్ని చిన్న వ్యాపారాలు చేసినా నష్టాలే ఎదురయ్యాయి. చివరకు ఒక వ్యక్తి మద్దతుతో చదువుకున్న అనీ.. సబ్ ఇన్‌స్పెక్టర్ టెస్ట్‌ రాసి ఉద్యోగం సంపాదించింది. జీవితంలో ఎదురైన కష్టాలను ఆత్మవిశ్వాసంతోనే ఎదుర్కొన్న తను ప్రస్తుతం స్థానిక వర్కల పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా జాయిన్ అయింది.

ఈ సందర్భంగా కేరళ పోలీస్ శాఖ.. ‘సంకల్ప బలానికి, ఆత్మవిశ్వాసానికి రోల్ మోడల్’ అంటూ శివను అప్రిషియేట్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇక కేరళ అపోజిషన్ లీడర్ వీడీ సతీషన్ కూడా శివ సక్సెస్ జర్నీని కొనియాడుతూ ట్వీట్ చేయడం విశేషం. ఏ తోడు లేకుండా ఒంటరి మహిళగా బిడ్డను పెంచుతూ.. లక్ష్యాన్ని సాధించిన తీరును ఆయన అభినందించారు. బలహీన మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్న పురుషాధిక్య సమాజంలో కష్టాలకు వెరవకుండా ఎదిగిన ఆమె జీవితం ఆదర్శప్రాయమని కొనియాడారు.

Tags:    

Similar News