ఆ కార్యకర్తల పై కేసులు వెనక్కి

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఆరె ప్రాంతంలో నిర్మించతలపెట్టిన మెట్రో కార్‌షెడ్‌ను కంజుర్‌మార్గ్‌లోని ప్రభుత్వ భూమిలోకి తరలిస్తున్నట్టు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. ఆరె ప్రాంతంలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ నిరసనలు చేసిన కార్యకర్తలపై నమోదైన కేసులను ఉపసంహరించనున్నట్టు తెలిపారు. మెట్రో ప్రాజెక్టుకు కార్ షెడ్‌ నిర్మాణానికి ఆరె ప్రాంతంలో 2,700 వృక్షాలను కొట్టేయాలని గత ప్రభుత్వం సంకల్పించింది. చెట్ల కొట్టివేతను నిరసిస్తూ వందలాది మంది పర్యావరణ కార్యకర్తలు గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లలో ఆందోళనలు చేశారు. సుమారు […]

Update: 2020-10-11 09:07 GMT

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఆరె ప్రాంతంలో నిర్మించతలపెట్టిన మెట్రో కార్‌షెడ్‌ను కంజుర్‌మార్గ్‌లోని ప్రభుత్వ భూమిలోకి తరలిస్తున్నట్టు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. ఆరె ప్రాంతంలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ నిరసనలు చేసిన కార్యకర్తలపై నమోదైన కేసులను ఉపసంహరించనున్నట్టు తెలిపారు. మెట్రో ప్రాజెక్టుకు కార్ షెడ్‌ నిర్మాణానికి ఆరె ప్రాంతంలో 2,700 వృక్షాలను కొట్టేయాలని గత ప్రభుత్వం సంకల్పించింది.

చెట్ల కొట్టివేతను నిరసిస్తూ వందలాది మంది పర్యావరణ కార్యకర్తలు గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లలో ఆందోళనలు చేశారు. సుమారు 30 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను వెనక్కి తీసుకోవాలని హోంశాఖను ఆదేశించినట్టు తాజాగా ఠాక్రే తెలిపారు. ఆరె ప్రాంతంలోని 800 ఎకరాల భూమిని రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌గా ప్రకటించారు. గిరిజనుల హక్కులను భంగం కలనివ్వమని స్పష్టం చేశారు. ముంబయి పట్టణంలో సహజమైన అడవి ఉన్నదని, ఈ సంపదను కాపాడుకోవాల్సిన అవసరమున్నదని వివరించారు. కాగా, ఠాక్రే విధానం తప్పని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు.

Tags:    

Similar News