చేతులు, కాళ్లు విరిచి ముగ్గురు అబ్బాయిలపై అత్యాచారం
దిశ, వెబ్‌డెస్క్ : అతడి వయసు 19 సంవత్సరాలు. కానీ ఇప్పటికే మూడు హత్యలు చేసిన కృూరుడు. చిన్న పిల్లల్ని టార్గెట్ చేసే ఆ యువకుడు.. వారి కాళ్లు విరుస్తూ.. చేతులను విరగ్గొడుతూ అత్యాచారాలకు పాల్పడుతాడు. ఆ సమయంలో చిన్నారులు పెట్టే ఆర్తనాదాలు అతడిలో కిక్కు తెప్పిస్తాయట. వాళ్ల అరుపులకు మరింత రెచ్చిపోయి చిత్రహింసలకు గురి చేస్తూ ఆనందం పొందుతాడు ఈ కర్కోటకుడు. సినిమాల్లోనే కనిపించే ఇలాంటి దృశ్యాలు.. ఇతడి పైశాచికత్వంతో రియల్ గా చూడాల్సి వచ్చింది. […]
దిశ, వెబ్‌డెస్క్ : అతడి వయసు 19 సంవత్సరాలు. కానీ ఇప్పటికే మూడు హత్యలు చేసిన కృూరుడు. చిన్న పిల్లల్ని టార్గెట్ చేసే ఆ యువకుడు.. వారి కాళ్లు విరుస్తూ.. చేతులను విరగ్గొడుతూ అత్యాచారాలకు పాల్పడుతాడు. ఆ సమయంలో చిన్నారులు పెట్టే ఆర్తనాదాలు అతడిలో కిక్కు తెప్పిస్తాయట. వాళ్ల అరుపులకు మరింత రెచ్చిపోయి చిత్రహింసలకు గురి చేస్తూ ఆనందం పొందుతాడు ఈ కర్కోటకుడు. సినిమాల్లోనే కనిపించే ఇలాంటి దృశ్యాలు.. ఇతడి పైశాచికత్వంతో రియల్ గా చూడాల్సి వచ్చింది. 14 ఏండ్లకే హత్య చేసిన ఈ రాక్షసుడు.. మైనర్ అబ్బాయిలపైనే అత్యాచారాలు చేయడం చూస్తే అతడి సైకో ఇజం ఏంటో తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో బాలుడి మిస్సింగ్, హత్య కేసు తీగ లాగిన పోలీసులకు కళ్లు చమ్మగిల్లే వాస్తవాలు బయటపడ్డాయి.
మధ్యాహ్నం 3 గంటలు..
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లంపూడి గ్రామంలో ఈనెల 14న ఇంటి బయట ఆడుకుంటున్న కుర్ర భార్గవ్ తేజ (6) మధ్యాహ్నం 3 గంటల సమయంలో కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ లభించలేదు. ఆందోళన చెందిన పేరెంట్స్ వెంటనే తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులకు మరో కేసుతో ఈ ఘటనకు సారూప్యం ఉండడాన్ని గమనించారు. ఫిబ్రవరి 11న ఇదే మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన బండి మరియదాసు, మీనాక్షి కుమారుడు బండి అఖిల్ (8) కూడా సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆడుకోవడానికి వెళ్లి.. ఆ తర్వాత కనిపించ లేదు. ఆ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిఉంది. ప్రస్తుతం మెల్లంపూడి కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఓవర్ యాక్షనే పట్టించిందా…?
బాలుడి బంధువులు, గ్రామస్తుల సహకారంతో గాలింపు చేపట్టిన పోలీసులకు గ్రామానికి చెందిన మెల్లంపూడి గోపయ్య అలియాస్ గోపి ప్రవర్తన, అతడి ఓవర్ యాక్షన్ పై పోలీసులకు అనుమానం వచ్చింది. టెంట్ హౌస్ లో పని చేసే అతడిపై నిఘా పెట్టిన పోలీసులకు వారి అనుమానాలు బలపడ్డాయి. వెంటనే గోపిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు హత్యలు చేసినట్లు తేలింది. షాక్ కు గురైన పోలీసులు ఆ హత్యలు ఎందుకు చేశాడు..? ఎలా చేశాడు..? మృతదేహాలను ఏం చేశాడో కూపీ లాగుతున్నారు.
వాళ్ల అరుపులు.. అతడికి ఆనందం
కిడ్నాప్ చేసిన పిల్లలను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేస్తూ.. అత్యాచారాలకు పాల్పడడం గోపికి అలవాటు. ఇలా 14వ ఏటనే తన స్నేహితుడిని సినిమాకు తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఫిబ్రవరిలో మరో బాలుడిని తీసుకెళ్లి అలాగే చేశాడు. తాజాగా భార్గవ తేజను అత్యంత కృూరంగా హింసించి, అత్యాచారం చేసి హత్య చేశాడు. గోపి పెట్టే చిత్రహింసలకు తట్టుకోలేని పసి హృదయాలు తల్లడిల్లుతుంటే.. వారిని చూసి వికృతంగా నవ్వేవాడని పోలీసుల విచారణలో తేలింది. కిడ్నాప్ చేసిన అబ్బాయిలను చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారం చేసేవాడు. ఆ తర్వాత చేతులు, కాళ్లను విరిచి.. ముఖాన్ని గుర్తు పట్టకుండా చెక్కేవాడు. మృతదేహాలను మాయం చేసేవాడు.
అందరి హత్యలు ఒకే విధంగానే..
మార్చి 14న ఇంటిముందు ఆడుకుంటున్న భార్గవతేజకు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు గోపి. ఆ తర్వాత బాలుడి చేతులు, కాళ్లు కట్టేసి లైంగిక దాడి జరిపి, అనంతరం తీవ్రంగా కొట్టి హత్య చేశాడు. బాలుడి మృతదేహం కాళ్లు, చేతుల్ని విరిచేసి, ముఖాన్ని గాయపర్చి ఇంటి వెనుకున్న అరటి తోటలో పడేశాడు. ఫిబ్రవరి 11న వడ్డేశ్వరం గ్రామానికి చెందిన బండి అఖిల్ ను ఇదే విధంగా తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. అయితే అఖిల్ ఆడుకుంటూ వెళ్లి బకింగ్‌హామ్ కెనాల్‌లో పడిపోయి ఉంటాడని పోలీసులు, బంధువులు భావించి కేసును తాత్కాలికంగా వదిలేశారు. గోపి14 ఏళ్ల వయసులో తన స్నేహితుడిని సెకండ్ షో సినిమాకు తీసుకువెళ్లి ఇదే తరహాలో హతమార్చినట్టు సమాచారం. సినిమా మధ్యలో ఫ్రెండ్ ని బయటకు తీసుకొచ్చిన గోపి అతడిపై లైంగిక దాడి చేసి చంపి, మృతదేహాన్ని రేవేంద్రపాడు బ్రిడ్జి మీద నుంచి బకింగ్‌హామ్ కెనాల్‌లో పడేసినట్టు గ్రామస్తులు చెబుతుంటారు. దీనిపై అప్పట్లో కేసు కాకుండా స్థానికులు కాంప్రమైజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోపి పాల్పడిన దురాఘతాలు వెలుగులోకి రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఆ సైకోని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.