దుబాయ్‌లో తెలంగాణ యువకుడి ఆత్మహత్య

దిశ,జగిత్యాల :  దుబాయ్‌లో పని దొరకకపోవడంతో మనస్తాపం చెందిన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మెట్ పెల్లి గ్రామానికి చెందిన బొమ్మల శివ కుమార్ (29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శివ కుమార్  దుబాయ్ లో తాను ఉంటున్న గదిలో  గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరు సంవత్సరాలుగా దుబాయ్ లోని ఓ కంపెనీలో క్లీనింగ్ సెక్షన్ లో పని చేసి కరోన నేపథ్యంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఇంట్లో వివాహ సంబంధాలు చూడటంతో గత […]

Update: 2021-04-04 20:47 GMT

దిశ,జగిత్యాల : దుబాయ్‌లో పని దొరకకపోవడంతో మనస్తాపం చెందిన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మెట్ పెల్లి గ్రామానికి చెందిన బొమ్మల శివ కుమార్ (29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

శివ కుమార్ దుబాయ్ లో తాను ఉంటున్న గదిలో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరు సంవత్సరాలుగా దుబాయ్ లోని ఓ కంపెనీలో క్లీనింగ్ సెక్షన్ లో పని చేసి కరోన నేపథ్యంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఇంట్లో వివాహ సంబంధాలు చూడటంతో గత 10 నెలల క్రితం వివాహం చేసుకొని, ఇటీవలే మూడు నెలల క్రితం తిరిగి గతంలో పనిచేసిన కంపెనీకి అదే పని మీద వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్లిన తరువాత గతంలో చేసిన పని కాకుండా శివ కుమార్ ను కొద్ది రోజులు ఫారెస్ట్ లో పని చేయించారని , తరువాత రెండు నెలల నుంచి రూమ్ లోనే ఖాళీగా ఉంచారని స్నేహితులకు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే శివ కుమార్ గతంలో సంపాదించిన కొంత డబ్బులతో ఇల్లు నిర్మించాడని ఆ ఇంటి నిర్మాణానికి పది లక్షల వరకు అప్పు చేశాడని స్నేహితులు తెలిపారు. దుబాయికి వెళ్లి మూడు నెలలు అవుతున్నా ఎలాంటి పని, జీతం ఇవ్వకుండా కంపెనీ వాళ్ళు గదికే పరిమితం చేశారని, తనను ఇండియాకు రప్పించే ప్రయత్నం చేయమని స్నేహితులకు గురువారం ఫోన్ చేశాడని శివకుమార్ కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు నెలలుగా జీతం లేకపోవడం, ఇంటి కోసం చేసిన అప్పుల తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని బంధువులు తెలిపారు. అయితే మృతుని భార్య ఇప్పుడు ఐదు నెలల గర్భిణీ అని కుటుంబ సభ్యులకు శివకుమార్ మరణవార్త ఇంకా తెలియలేదని మృతుని బంధువులు తెలిపారు.

Tags:    

Similar News