భయం, నిర్లక్ష్యం రెండు ప్రమాదమే : చిరు

దిశ, వెబ్‌డెస్క్: యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తూ నిర్మాత రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నుంచి వీడియో రిలీజ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి కరోనా గురించి జాగ్రత్తలు చెప్తున్న వీడియోను.. వర్డ్ ఆఫ్ కాషన్ పేరుతో విడుదల చేసింది. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం వచ్చిందన్నారు చిరు. మనకేదో అయిపోతుందనే భయం … మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం … […]

Update: 2020-03-19 02:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తూ నిర్మాత రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నుంచి వీడియో రిలీజ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి కరోనా గురించి జాగ్రత్తలు చెప్తున్న వీడియోను.. వర్డ్ ఆఫ్ కాషన్ పేరుతో విడుదల చేసింది.

యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం వచ్చిందన్నారు చిరు. మనకేదో అయిపోతుందనే భయం … మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం … రెండు కూడా ప్రమాదమే అని తెలిపారు. అందుకే కరోనా ఉపద్రవం తగ్గే వరకు జనసమూహానికి దూరంగా ఉండాలని.. వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలని.. తరుచుగా మోచేతి వరకు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. దగ్గినా, తుమ్మినా ఖర్చీఫ్ లేదా టిష్యూ పేపర్‌ను అడ్డుపెట్టుకోవాలన్నారు. ఆ పేపర్‌ను జాగ్రత్తగా చెత్తబుట్టలో పడేయాలన్నారు. చేతిని కళ్లు, నోరు, ముక్కు, ముఖానికి తగలకుండా చూసుకోవాలన్నారు. జ్వరం, జలుబు, నీరసం ఉన్నట్లైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. మీ జలుబు, దగ్గు ఇతరులకు అంటించకుండా మాస్క్ ధరించాలన్నారు.

కరోనా ప్రమాదకారి కాదు కానీ.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే మహమ్మారి అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు చిరు. అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని… ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దామని పిలుపునిచ్చారు.


Tags: Megastar Chiranjeevi, CoronaVirus, Caution, Covid 19, Konidela Production Company

Tags:    

Similar News