అత్యాచారం చేసి.. ఆపై గొంతుకోసి..చివరికి

దిశ, వెబ్ డెస్క్: నేటి సమాజంలో మృగాళ్ల పైశాచికత్వం రోజు రోజుకు పెట్రేగిపోతుంది. ఎన్ని చట్టాలు చేసినా, శిక్షలు వేసినా కామాంధులు మారడం లేదు. ఓ మహిళపై అత్యాచారం చేసి గొంతుకోసి హతమార్చి ఆపై ఆమహిళ మృతదేహాన్ని డ్రైనేజీలో వేసిన ఘటన మహారాష్ట్రలోని మంబాయిలో చోటు చేసుకుంది. బుధవారం ముంబాయిలోని బాంద్ర కుర్లా కాంప్లెక్స్ దగ్గర ఉన్న డ్రైనేజీలో ఓ మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని […]

Update: 2021-05-12 08:01 GMT

దిశ, వెబ్ డెస్క్: నేటి సమాజంలో మృగాళ్ల పైశాచికత్వం రోజు రోజుకు పెట్రేగిపోతుంది. ఎన్ని చట్టాలు చేసినా, శిక్షలు వేసినా కామాంధులు మారడం లేదు. ఓ మహిళపై అత్యాచారం చేసి గొంతుకోసి హతమార్చి ఆపై ఆమహిళ మృతదేహాన్ని డ్రైనేజీలో వేసిన ఘటన మహారాష్ట్రలోని మంబాయిలో చోటు చేసుకుంది. బుధవారం ముంబాయిలోని బాంద్ర కుర్లా కాంప్లెక్స్ దగ్గర ఉన్న డ్రైనేజీలో ఓ మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అత్యాచారం చేసి గొంతుకోసి హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్థారణ చేశారు. అంతేకాకుండా సదరు మహిళ ప్రైవేటు భాగాలలో కూడా గాయాలు ఉన్నట్లు తెలిపిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News