అగ్రరాజ్యంలో భారత సంతతి మహిళకు అరుదైన అవకాశం
దిశ, వెబ్‌డెస్క్: భారత సంతతికి చెందిన మరో ఇండియన్ అమెరికన్‌కు బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించింది. అగ్రరాజ్యంలో కీలక పదవి కల్పించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీనియర్ సలహాదారుగా భారత సంతతికి చెందిన నీరా టాండన్ నియమితులయ్యారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆమె నియామకంపై సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్(సీఏపీ) వ్యవస్థాపకుడు జాన్ పొడెస్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీరా తెలివితేటలు, చిత్తశుద్ధి, రాజకీయ […]
దిశ, వెబ్‌డెస్క్: భారత సంతతికి చెందిన మరో ఇండియన్ అమెరికన్‌కు బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించింది. అగ్రరాజ్యంలో కీలక పదవి కల్పించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీనియర్ సలహాదారుగా భారత సంతతికి చెందిన నీరా టాండన్ నియమితులయ్యారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆమె నియామకంపై సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్(సీఏపీ) వ్యవస్థాపకుడు జాన్ పొడెస్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీరా తెలివితేటలు, చిత్తశుద్ధి, రాజకీయ అవగాహన బైడెన్ పరిపాలను చాలా ఉపయోగపడుతుందని అన్నారు. అంతేగాకుండా… సీనియర్ సలహాదారుగా నీరా టిండాన్ సాధించే విజయాలను చూసేందుకు ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు సలహాదారుగా నీరా టాండన్ గతంలో పని చేశారు.