Huge Encounter: కుల్గాంలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగిన ఘటన జమ్ముకాశ్మీర్ (Jammu Kashmir) రాష్ట్రంలోని కుల్గాం (Kulgam) జిల్లాలో చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగిన ఘటన జమ్ముకాశ్మీర్ (Jammu Kashmir) రాష్ట్రంలోని కుల్గాం (Kulgam) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బేహిబాగ్ (Behibhag) ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయంటూ కేంద్ర ఇంటలిజెన్స్ బృందం లోకల్ పోలీసులకు సమాచారం అందజేసింది. దీంతో అక్కడి పోలీసులు ఆర్మీకి చెందిన 34 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్ (CRPF) సిబ్బంది సంయుక్తంగా కద్దర్ (Kaddar) గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ అపరేషన్ (Cordon and Search Operation) ప్రారంభించింది. ఈ క్రమంలోనే అక్కడే దాక్కొని ఉన్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అనంతరం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు ప్రాణాలతో పట్టుబడ్డారు. అదేవిధంగా ఇద్దరు ఆర్మీ సిబ్బందికి స్వల్పంగా గాయపడ్డారు.