TG Assembly: నేడు గంట ముందే అసెంబ్లీకి సీఎం రేవంత్.. సభ ముందుకు ఆ నాలుగు కీలక బిల్లులు
తెలంగాణ అసెంబ్లీ (Assembly) సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Assembly) సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. నేడు సభలో భూభారతి బిల్లు (Bhu Bharathi)పై చర్చ కొనసాగించనున్నారు. అదేవిధంగా ప్రభుత్వం తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు (Telangana Municipality Amendment Bill), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు (Greater Hyderabad Municipal Corporation Bill), తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు (Telangana Panchayat Raj Amendment Bills)లను కూడా ప్రవేశపట్టనున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ సంక్రాంతి (Sankranthi) నుంచి ప్రభుత్వం ప్రారంభించబోతున్న రైతు భరోసా (Raithu Bharosa)పై కూడా సభలో చర్చ జరగనుంది. నేడు అసెంబ్లీ (Assembly)లో కీలక బిల్లులు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఇవాళ గంట ముందే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. భూభారతి (Bhu Bharathi), రైతు భరోసా (Raithu Bharosa)పై సభలో చర్చ సందర్భంగా వారికి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.