TG Assembly: అసెంబ్లీలో బీఆర్ఎస్, బీజేపీ వాయిదా తీర్మానాలు.. ఆ అంశాలపై చర్చకు పట్టు

తెలంగాణ అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో వాయిదా తీర్మానాల పర్వం కొనసాగుతోంది.

Update: 2024-12-19 04:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో వాయిదా తీర్మానాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే లగచర్ల (Lagacharla) ఘటనలో రైతుల అరెస్ట్‌, రాష్ట్ర అప్పులపై వాయిదా తీర్మానాలను ఇచ్చిన బీఆర్ఎస్ (BRS) ఇవాళ మరో తీర్మానన్ని అసెంబ్లీ సెక్రటరీకి అందజేసింది. రాష్ట్రంలో రైతులు పంట పెట్టుబడి సాయం అందక, రుణమాఫీ కాకపోవడం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ యాసంగిలోనే వానాకాలంతో కలిపి ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని కోరారు. అదేవిధంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.2 లక్షల రుణ మాఫీ కాని వారి ఖాతాల్లో వెంటనే నిధులు జమ చేయాలని తెలిపారు. అన్ని పంటలకు బోనస్ వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు బీజేపీ నేతలు జీవో నెం.317పై వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీజేపీ ఎమ్మెల్యేలు నోటీసులు పేర్కొన్నారు.    

Tags:    

Similar News