Musi canals : మూసీ కాలువలకు నిధులు హర్షనీయం : ఎమ్మెల్యేలు కుంభం, బీర్ల

భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలలోని 60వేల ఎకరాలకు మూసీ నీటిని అందించే(Musi canals)ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునాదిగాకి కాలువ పనులకు నిధులు విడుదల పట్ల అసెంబ్లీలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Kumbham Anil kumar Reddy), బీర్ల అయిలయ్య(Beerla Ilaiah), మందుల సామేల్, వేముల వీరేశం(Vemula Veeresham)లు అసెంబ్లీ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

Update: 2024-12-19 06:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలలోని 60వేల ఎకరాలకు మూసీ నీటిని అందించే(Musi canals)ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునాదిగాకి కాలువ పనులకు నిధులు విడుదల పట్ల అసెంబ్లీలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Kumbham Anil kumar Reddy), బీర్ల అయిలయ్య(Beerla Ilaiah), మందుల సామేల్, వేముల వీరేశం(Vemula Veeresham)లు అసెంబ్లీ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖపై చర్చలో వారు మాట్లాడారు.

కుంభం అనిల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంజూరైన బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల పొడిగింపు పనులు ఆనాడే 40శాతం పూర్తయిన తదుపరి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మురికి మూసీ సాగు నీటికి కూడా ఈ ప్రాంత రైతులు నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకుని బునాదిగాని కాలువకు. రూ.224 కోట్ల నిధులు, . ధర్మారెడ్డి కాలువకు రూ.129 కోట్లు, పిల్లాయిపల్లి కాలువకు రూ.95 కోట్లు మంజూరీ చేయడం సంతోషకరమన్నారు. నిధులను త్వరితగతిన విడుదల చేసి పనులు పూర్తి చేయాలని కోరారు. బస్వాపురం కాలువకు హైవే క్రాసింగ్ పనులు పూర్తి చేయలేదని, రిజర్వాయర్ నిర్వాసితులకు గత ప్రభుత్వం నాలుగేళ్లుగా పెండింగ్ లో పెట్టిందన్నారు. ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీలు పూర్తి చేసి 2వేల కోట్ల రిజర్వాయర్ ను వినియోగంలోకి తేవాలని కోరారు. బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా గొప్పలకు పోయి భారీ ప్రాజెక్టులను వేలకోట్లతో చేపట్టి నిధులు దండుకోకుండా..తక్కువ మొత్తంలో ఎక్కువ ఆయాకట్టు వచ్చేలా పెండింగ్ పనులు పూర్తి చేయించేలా మంత్రి ఉత్తమ్ ప్రయత్నిస్తుండటం అభినందనీయమన్నారు.

ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ మూసీ కాలువలకు నిధులు మంజూరీ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ కు ధన్యవాదాలన్నారు. తపాస్ పల్లి , నవాబ్ పేట నుంచి నీటి విడుదల చేసి 100చెరువులు నింపారని, అయితే శాశ్వత పరిష్కారంగా గంధమల్ల రిజర్వాయర్ ను పూర్తి చేయాలని కోరారు. రాజాపేట మండలంలో అసంపూర్తి కాలువలను పూర్తి చేయాలని కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలేరు నియోజకవర్గానికి గోదావరి నీళ్లు తెచ్చి ప్రజల కాళ్లు కడిగే అవకాశం నాకు ఇచ్చారన్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 60వేల ఎకరాలకు నీరందించే ఆ మూడు మూసీ కాలువలను ఎమ్మెల్యేలు భూసేకరణలో చొరవ తీసుకుంటే ఏడాది వ్యవధిలోనే పూర్తి చేయిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవంతో గోదావరి నీళ్లు మూసీకి వస్తే మూసీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయకట్టుకు మరింత నీటి వసతి పెరిగుతుందన్నారు.

Tags:    

Similar News