Komatireddy Rajagopal Reddy : నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నూతన సచివాలయం పక్కనే కొత్త అసెంబ్లీ భవనం నిర్మిస్తే బాగుంటుందన్న తన వ్యాఖ్యలను వక్రీకరించారని(My comments were distorted)కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మండిపడ్డారు.

Update: 2024-12-19 08:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : నూతన సచివాలయం పక్కనే కొత్త అసెంబ్లీ భవనం నిర్మిస్తే బాగుంటుందన్న తన వ్యాఖ్యలను వక్రీకరించారని(My comments were distorted)కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మండిపడ్డారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ అంటే నాకు గౌరవమని, ఆయన లెజెండరీ నాయకుడని..ఆయనంటే అందరికీ అభిమానమని కొనియాడారు. తాను ఎన్టీఆర్ ఘాట్ తొలగించి కొత్త అసెంబ్లీ కట్టాలని అన్నట్లుగా నేను అనని మాటల్ని అన్నానని వక్రీకరించి దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్వక్తం చేశారు.

నా ఎదుగుదలను అడ్డుకునే కుట్ర జరుగుతుందని, దయచేసి మరోసారి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు పునరావృతం కాకుండా చూడాలని మీడియా సోదరులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వచ్చినా 10 ఏళ్ళ తరువాత కూడా ఆంధ్రమీడియా తెలంగాణ రాజకీయాలను శాసించాలని చూస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని మేము ఏ మాత్రం ఒప్పుకోబోమన్నారు. ఎన్టీఆర్ అంటే మాకు గౌరవం ఉందని కానీ ఆంధ్ర మీడియా నా మాటలను వక్రీకరించిందని ఆరోపించారు. కొందరు మమ్మల్ని వివరణ అడుగుతున్నారని, మాకు కూడా ఆత్మ గౌరవం ఉందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News