Kaleswaram Commission: కొనసాగుతోన్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ.. హాజరైన సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్
జస్టిస్ పినాకి చంద్రఘోష్ (Justice Pinaki Chandraghose) ఆధ్వర్యంలోని కాళేశ్వరం కమిషన్ (Kaleswaram Commission) బహిరంగ విచారణ రెండో రోజు కొనసాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: జస్టిస్ పినాకి చంద్రఘోష్ (Justice Pinaki Chandraghose) ఆధ్వర్యంలోని కాళేశ్వరం కమిషన్ (Kaleswaram Commission) బహిరంగ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఈ మేరకు కమిషన్ ఎదుట మాజీ సీఎస్ సోమేష్ కుమార్ (Former CS Somesh Kumar), అప్పట్లో సీఎంవోలో సెక్రటరీగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ (IAS Smita Sabharwal) హాజరయ్యారు. విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleswaram Commission) పనులకు సంబంధించి కమిషన్ చైర్మన్ పినాకీ చంద్రఘోష్ (Justice Pinaki Chandraghose) వారిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. కేబినెట్ ఆమోదం లేకుండానే 3 బ్యారేజీలకు పరిపాలన అనుమతులు ఇచ్చారా అని కమిషన్ స్మితా సబర్వాల్‌ను కమిషన్ ప్రశ్నించించింది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు నాకు తెలియదు, అవగాహన లేదు అని స్మితా సబర్వాల్ సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సీఎంవోకి వచ్చే ప్రతి ఫైల్‌కు సీఎం ఆమోదం ఉంటుందని, సీఎంవోలో తాను ఏడు శాఖలను చూసినట్లు స్మితా సబర్వాల్ వెల్లడించారు. చెప్పారు. మై రోల్ ఈజ్ లిమిటెడ్.. జనరల్ కో-ఆర్డినేషన్ మాత్రమే అని కమిషన్ ఆమె వివరించారు. మరోవైపు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విచారణ కోర్టు హాల్లోకి పిలిచిన వెంటనే రాకపోవడంతో సోమేశ్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్మితా సబర్వాల్ సీఎంవోలో కీలకంగా వ్యవహరించగా, సోమేశ్ కుమార్ సీఎస్‌గా విధులు నిర్వర్తించారు.
కాగా, బుధవారం మాజీ సీఎస్ ఎస్‌కే జోషి (SK Joshi), మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ (Rajath Kumar) విచారణను ఎదుర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleswaram Commission)కు సంబంధించి మేడిగడ్డ (Medigadda), అన్నారం (Annaram), సుందిళ్ల (Sundilla) బ్యారేజీల నిర్మాణాల విషయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR), అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అని మాజీ సీఎస్ ఎస్‌కే జోషి (SK Joshi) కమిషన్‌కు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన వ్యాప్కోస్ (Vyapcos), సీఈ-సీడీవో (CA-CDO), ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో వారే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. 2016 మే 2న మేడిగడ్డ (Medigadda) వద్ద భూమి పూజ చేసి బ్యారేజీల నిర్మాణాలను కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. అదే రోజు ప్రాణహిత - చేవెళ్ల (Pranahita - Chevella) ప్రాజెక్ట్ పేరును కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project)గా మార్చేశారని కమిషన్‌కు వివరించారు.