అమరవీరుల స్థూపానికి ఘోర అవమానం
దిశ, కొత్తగూడెం: అమరవీరుల స్థూపానికి ఘోర అవమానం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో అమరవీరుల స్థూపంపై మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయి. వందల మంది ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైంది. తెలంగాణ పోరాటంలో వందల మంది ప్రాణ త్యాగాలకు గుర్తుగా అమరవీరుల స్థూపాన్ని కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ ప్రధాన రహదారిలో ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినా.. ముందుగా అమరవీరుల స్థూపానికి దండ వేసి […]
దిశ, కొత్తగూడెం: అమరవీరుల స్థూపానికి ఘోర అవమానం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో అమరవీరుల స్థూపంపై మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయి. వందల మంది ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైంది. తెలంగాణ పోరాటంలో వందల మంది ప్రాణ త్యాగాలకు గుర్తుగా అమరవీరుల స్థూపాన్ని కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ ప్రధాన రహదారిలో ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినా.. ముందుగా అమరవీరుల స్థూపానికి దండ వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనవాయితీ. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో గత రాత్రి ఆకతాయిలు మద్యం సేవించి అమరవీరుల స్థూపంపై ఉంచి వెళ్ళిపోయారు. వందల సంఖ్యలో వాహనాలు అటువైపుగా వెళ్తున్నా.. ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కలెక్టర్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఆర్డీవో ఆఫీసులకు వెళ్లాలంటే ప్రధాన రహదారి మార్గం ఇదే. అయినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలొస్తున్నాయి.