విద్యార్థులు లేకున్నా ఉపాధ్యాయుడు తప్పనిసరి

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులు లేకున్నా ప్రతి పాఠశాలకు ఒక ఉపాధ్యాయడు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నూతనంగా రూపొందించిన రేషనలైజేషన్ ప్రక్రియలో పేర్కొంది. 2020-21 యూడైస్ వివరాల ఆధారంగా ఉపాధ్యాయుల హేతుబద్దీకరణను నిర్ణయించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయలను కేటాయించారు. రేషనలైజేషన్ ప్రక్రియను పక్కగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అడిషినల్ కలెక్టర్, జిల్లా పరిషత్ చీఫ్ ఎక్జిక్యూటీవ్ ఆఫీసర్, పీఓ, ఐటీడీఏలు […]

Update: 2021-08-17 19:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులు లేకున్నా ప్రతి పాఠశాలకు ఒక ఉపాధ్యాయడు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నూతనంగా రూపొందించిన రేషనలైజేషన్ ప్రక్రియలో పేర్కొంది. 2020-21 యూడైస్ వివరాల ఆధారంగా ఉపాధ్యాయుల హేతుబద్దీకరణను నిర్ణయించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయలను కేటాయించారు. రేషనలైజేషన్ ప్రక్రియను పక్కగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అడిషినల్ కలెక్టర్, జిల్లా పరిషత్ చీఫ్ ఎక్జిక్యూటీవ్ ఆఫీసర్, పీఓ, ఐటీడీఏలు సభ్యులుగా ఉండగా, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.

2020-21 యూడైస్ లోని వివరాల ఆధారంగా అదనపు సిబ్బంది ఉన్న పాఠశాలలను, సిబ్బంది కొరత ఉన్న పాఠశాలలను కమిటీ గుర్తించనుంది. సీనియారిటీ ఇన్ సర్వీస్ ఆధారంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టనున్నారు. పాఠశాలలోని జూనియర్‌గా ఉన్న ఉపాధ్యాయుడిని అదనపు సిబ్బందిగా గుర్తించి, ఆ ఉపాధ్యాయుడిని బదిలీ చేయనున్నారు. ఒకవేళ సీనియర్ ఉపాధ్యాయులు బదిలీ అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేస్తే వారికి అవకాశం కల్పించనున్నారు. రేషనలైజేషన్ ఆదేశాలను జారీ చేసిన 10 రోజులలోపే ఉపాధ్యాయులు తమ అభ్యంతరాలను తెలియజేయాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. జీఓలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం రేషనలైజేషన్‌లో కొత్త పోస్టులను మంజూరు చేయడం కాని, ఉన్న పోస్టులను రద్ధు చేయడం కాని ఎట్టి పరిస్థితుల్లో కుదరదని తెలిపారు.

ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి లేకున్నా ఉపాధ్యాయుడిని కేటాయించారు. 19 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే విధులు నిర్వహించనున్నారు. అత్యధికంగా 361 నుంచి 400 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలకు ఒక హెడ్ మాస్టర్, 10 మంది ఎస్‌జీటీ సిబ్బంది మొత్తం 11 మంది సిబ్బందిని కేటాయించారు. అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో 100 మంది వరకు విద్యార్థులున్న పాఠశాలకు ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లను, ఇద్దరు లాంగ్వేజ్ పండిత్‌లను మొత్తం నలుగురు సిబ్బందిని కేటాయించారు. అత్యధికంగా 351 నుంచి 385 మంది విద్యార్థులున్న పాఠశాలలకు 8 మంది స్కూల్ అసిస్టెంట్లను, నలుగురు లాంగ్వేజ్ పండిత్‌లను మొత్తం 12 మంది సిబ్బందిని కేటాయించారు. హైస్కూల్ లో 200 మంది వరకు విద్యార్థులున్న పాఠశాలకు ఒక హెడ్ మాస్టర్ ను, ఒక పీఈటీని, 7 మంది స్కూల్ అసిస్టెంట్లను మొత్తం 9 మంది సిబ్బందిని కేటాయించారు. అత్యధికంగా 1181 నుంచి 1210 మంది విద్యార్థులున్న హైస్కూల్ లో ఒక హెడ్ మాస్టర్ ను, ఇద్దరు పీఈటీలను, 11 మంది లాంగ్వేజ్ పండిత్ లను, ఒక డ్రాయింగ్ లేదా మ్యూజిక్ టీచర్ ను, 30 మంది స్కూల్ అసిస్టెంట్లను మొత్తం 45 మంది సిబ్బందిని కేటాయించారు. వీటితో పాటు ఒకే కాంపౌండ్ లో ఉన్న స్కూళ్ల విలీనానికి తగిన చర్యలు చేపట్టనున్నారు.

Tags:    

Similar News