37 గంటలు నిద్రపోతే చాలు.. రూ.25 లక్షల జీతం
దిశ, డైనమిక్ బ్యూరో : ‘నిద్రమొద్దు మోహపోడా.. పొద్దెక్కేదాక పడుకుంటవ్.. ఇక నువ్వు బాగుపడవ్ రా!..’ అంటూ నాన్న తిడుతున్నాడా? అయితే, ఇది మీకోసమే. అవును.. ఎంత ఎక్కువ పడుకుంటే అంత డబ్బులు సంపాదించొచ్చు. ఇలా పడుకోవడమే ఓ ఉద్యోగంగా ఉంటుందని ఎవరైనా అనుకుంటారా? కానీ బ్రిటన్‌లోని ఓ కంపెనీ దీనికోసం ఉద్యోగుల్ని తీసుకుంటుంది. ఈ ఉద్యోగంలో చేరాక.. రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు మెత్తటి పరుపుపై పడుకోవడమే. అవును.. ఒక వేళ నిద్ర రాకపోతే.. […]
దిశ, డైనమిక్ బ్యూరో : ‘నిద్రమొద్దు మోహపోడా.. పొద్దెక్కేదాక పడుకుంటవ్.. ఇక నువ్వు బాగుపడవ్ రా!..’ అంటూ నాన్న తిడుతున్నాడా? అయితే, ఇది మీకోసమే. అవును.. ఎంత ఎక్కువ పడుకుంటే అంత డబ్బులు సంపాదించొచ్చు. ఇలా పడుకోవడమే ఓ ఉద్యోగంగా ఉంటుందని ఎవరైనా అనుకుంటారా? కానీ బ్రిటన్‌లోని ఓ కంపెనీ దీనికోసం ఉద్యోగుల్ని తీసుకుంటుంది. ఈ ఉద్యోగంలో చేరాక.. రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు మెత్తటి పరుపుపై పడుకోవడమే. అవును.. ఒక వేళ నిద్ర రాకపోతే.. ఎంచక్కా.. టీవీ చూస్తూ కాలక్షేపం చేయొచ్చు. ఇలా వారానికి 37.5 గంటలు మెత్తటి పరుపుపై పడుకుంటే మీకు రూ.24.79 లక్షలు ఇస్తారు. అయితే, అసలు వారం రోజుల్లో పరుపు మీద పడుకుంటే ఎలా అనిపించిందో అభిప్రాయం చెబుతే చాలు. విలాసవంతమైన పరుపుల కంపెనీ ‘క్రాఫ్టెడ్ బెడ్స్’ ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మేము ఆఫీసుకే వెళ్లము.. మరీ అంత దూరం ఏం వెళతామనుకుంటే.. ఇంటికే పరుపుని పంపించి నిద్రపుచ్చే ఆలోచన కూడా ఈ కంపెనీ తీసుకుంది. అయితే, దీనికి 18 ఏళ్లు నిండి, బ్రిటిష్ పౌరసత్వం ఉండాల్సిందే.
పంది కిడ్నీని మనిషికి అమర్చిన డాక్టర్లు..
Bespoke luxury bed company crafted Beds are looking for a new mattress tester, who would be paid a hefty salary to nap and watch Netflix all week! https://t.co/9tPh67tFRn
— Glasgow Live (@Glasgow_Live) October 15, 2021