పులివెందులలో డేరింగ్ డాషింగ్ పోలీస్

దిశ, వెబ్‌డెస్క్: అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకునేందుకు ఓ పోలీసు ప్రాణానే పణంగా పెట్టారు. నిందితుడు కారుతో వచ్చి ఢీ కొట్టి ఈడ్చుకెళ్లినా.. పట్టువదలకుండా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మరీ అతడి ఆట కట్టించాడు. సినిమా క్లైమాక్స్‌ను తలపించే ఈ ఘటన కడప జిల్లా పులివెందులలో జరగడం గమనార్హం. కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో గోపినాథ్ రెడ్డి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అక్రమ మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో […]

Update: 2020-08-29 11:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకునేందుకు ఓ పోలీసు ప్రాణానే పణంగా పెట్టారు. నిందితుడు కారుతో వచ్చి ఢీ కొట్టి ఈడ్చుకెళ్లినా.. పట్టువదలకుండా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మరీ అతడి ఆట కట్టించాడు. సినిమా క్లైమాక్స్‌ను తలపించే ఈ ఘటన కడప జిల్లా పులివెందులలో జరగడం గమనార్హం.

కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో గోపినాథ్ రెడ్డి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అక్రమ మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో పీఎస్ పరిధి ప్రాంతంలోనే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అక్రమ మద్యాన్ని కారులో తరలిస్తున్న వ్యక్తి అటుగా వచ్చాడు. పోలీసులను పసిగట్టిన నిందితుడు.. కారు వేగాన్ని పెంచాడు. ఇది గమనించిన గోపినాథ్ రెడ్డి కారుకు అడ్డుగా వచ్చి నిలబడ్డారు.

పోలీసు అధికారి అడ్డుగా నిలబడిన ఆ వ్యక్తి ఏ మాత్రం కారు స్లో చేయకుండా నేరుగా వచ్చి ఢీ కొట్టాడు. దీంతో గోపినాథ్ ఒక్క సారి కారు టాప్ మీదకు ఎగిరిపడ్డారు. అయినప్పటికీ.. నిందితుడు కారు వేగం పెంచి ఎస్సైని ఈడ్చుకెళ్లాడు. ఎంతో చాకచక్యంగా.. పట్టువదలకుండా కారునే పట్టుకుని ఉన్న గోపినాథ్ రెడ్డి ఒక్కసారిగా తన చేతితోనే అద్దాన్ని పగులగొట్టాడు. ఎట్టకేలకు నిందితుడిని చేజిక్కిచ్చుకొని కారును ఆపేలా చేశారు. అది కూడా కారు రన్నింగ్ ఉండగానే నిందితుడి ఆట కట్టించిన తీరు సాహసోపేతం.

అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని కారు, అందులో ఉన్న 80 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. శభాష్ పోలీస్ అంటూ నెటిజన్లు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో గోపినాథ్ రెడ్డికి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News