ISS: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ప్రమాదం
దిశ, ఫీచర్స్: అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త, అక్కడి అన్ని రకాల సైంటిఫిక్ పరికరాలకు ముప్పుగా పరిణమిస్తోంది. దశాబ్దాలుగా శాటిలైట్స్, రాకెట్స్, ఇతర స్పేష్ మెషినరీ ద్వారా వెలువడ్డ శిథిలాలు భూమి కక్ష్యలో లాక్ చేయబడ్డాయి. ఈ వ్యర్థాల్లో కొన్నింటి వల్ల ఏ హాని జరగనప్పటికీ, చాలా వరకు వస్తువులు శాటిలైట్స్ ఫంక్షనింగ్‌తో పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు భారీ నష్టాన్నే కలిగిస్తున్నాయి. కాగా ఈ వ్యర్థ శిథిలాలు స్పేస్‌లో ఒకదానినొకటి ఢీకొనకుండా పరిస్థితులను చక్కదిద్దడం శాస్త్రవేత్తలకు సవాల్‌గా […]
దిశ, ఫీచర్స్: అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త, అక్కడి అన్ని రకాల సైంటిఫిక్ పరికరాలకు ముప్పుగా పరిణమిస్తోంది. దశాబ్దాలుగా శాటిలైట్స్, రాకెట్స్, ఇతర స్పేష్ మెషినరీ ద్వారా వెలువడ్డ శిథిలాలు భూమి కక్ష్యలో లాక్ చేయబడ్డాయి. ఈ వ్యర్థాల్లో కొన్నింటి వల్ల ఏ హాని జరగనప్పటికీ, చాలా వరకు వస్తువులు శాటిలైట్స్ ఫంక్షనింగ్‌తో పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు భారీ నష్టాన్నే కలిగిస్తున్నాయి. కాగా ఈ వ్యర్థ శిథిలాలు స్పేస్‌లో ఒకదానినొకటి ఢీకొనకుండా పరిస్థితులను చక్కదిద్దడం శాస్త్రవేత్తలకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యర్థ శకలం ‘ఐఎస్‌ఎస్’ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఐఎస్‌ఎస్‌లోని ‘కెనడార్మ్2’ అనే రోబోటిక్ ఆర్మ్ పార్ట్ దెబ్బతింది. అయితే దీర్ఘకాలికంగా సమస్యలు తలెత్తే స్థాయిలో డ్యామేజ్ జరగకపోవడం వల్ల రోబోటిక్ ఆర్మ్ బాగానే పనిచేస్తోంది.
స్పేస్ జంక్ వల్ల ప్రమాదాలు (The dangers of space junk)
అంతరిక్ష చెత్త పట్ల శాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తగా ఉంటారు. నిజానికి భూమి దిగువ కక్ష్యలో వీటి వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా స్పేస్ జంక్‌కు చెందిన 23,000 శిథిలాలను ప్రపంచంలోని స్పేస్ ఏజెన్సీలన్నీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంటాయి. ఇవన్నీ కూడా సాధారణ బంతి పరిమాణం కన్నా చిన్నవిగా ఉంటాయి. కానీ కక్ష్యలో ప్రయాణించేటప్పుడు పొందే వేగం కారణంగా ఢీకొన్నప్పుడు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాగా భూ కక్ష్యలో బంతి సైజు శకలాల కన్నా చిన్నగా ఉండే వస్తువులను ట్రాక్ చేయడమే కష్టం. ఇక అధికారికంగా ‘స్పేస్ స్టేషన్ రిమోట్ మానిప్యులేటర్ సిస్టమ్(ఎస్‌ఎస్‌ఆర్‌ఎంఎస్)గా పిలువబడే ‘కెనడార్మ్2’ను కెనడియన్ స్పేస్ ఏజెన్సీ(సీఎస్‌ఏ) రూపొందించింది. ఇది దాదాపు రెండు దశాబ్దాలుగా ఐఎస్‌ఎస్‌లో సేవలందిస్తోంది.
స్పేస్ స్టేషన్ బయట ఉండే వస్తువులను తొలగించడంతో పాటు స్టేషన్ నిర్వహణలో సాయపడటమే ఈ టైటానియం రోబోటిక్ ప్రధాన లక్ష్యం (Titanium robotic arm). కాగా తనిఖీలో భాగంగా కెనడార్మ్ దెబ్బతిన్నట్టు మొదటిసారిగా మే 12న గుర్తించారు. ఇక నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు నాసా, సీఎస్‌ఏ కలిసి పనిచేస్తుండగా.. ఈ ప్రమాదం రోబోటిక్ ఆర్మ్ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపలేదని సీఎస్‌ఏ బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. అయితే స్పేస్ జంక్ వల్ల ఇప్పటికీ ప్రమాదం పొంచే ఉంది. ఈ క్రమంలో చెత్త శిథిలాలు ఢీకొనకుండా ఉండేందుకు ఐఎస్‌ఎస్ గతేడాది మూడు అత్యవసర మోనోవర్స్(రక్షణ చర్యలు) నిర్వహించిన విషయం తెలిసిందే.
A piece of space debris recently damaged the International Space Station