జెట్ స్పీడ్‌లో స్పోర్ట్స్ బైక్.. అంతలోనే అడ్డొచ్చిన మహిళ..!
దిశ, వెబ్‌డెస్క్: రహదారులను దాటడానికి డివైడర్ల మీదుగా క్రాస్ చేయకండి.. పాదచారుల క్రాసింగ్‌నే ఉపయోగించండి.. అంటూ ట్రాఫిక్ పోలీసులు ప్రతి నిత్యం చెబుతూనే ఉంటారు. అవగాహన కోసం బోర్డులు పెడుతుంటారు. ఇలా ఎన్నిసార్లు చెప్పిన కొంతమంది రోడ్ల మీదకు వచ్చినప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని సార్లు అయితే ఏకంగా ప్రాణాలనే కోల్పోతున్నారు. తాజాగా నిర్లక్ష్యం కారణంగా రాయదుర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. […]
దిశ, వెబ్‌డెస్క్: రహదారులను దాటడానికి డివైడర్ల మీదుగా క్రాస్ చేయకండి.. పాదచారుల క్రాసింగ్‌నే ఉపయోగించండి.. అంటూ ట్రాఫిక్ పోలీసులు ప్రతి నిత్యం చెబుతూనే ఉంటారు. అవగాహన కోసం బోర్డులు పెడుతుంటారు. ఇలా ఎన్నిసార్లు చెప్పిన కొంతమంది రోడ్ల మీదకు వచ్చినప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని సార్లు అయితే ఏకంగా ప్రాణాలనే కోల్పోతున్నారు. తాజాగా నిర్లక్ష్యం కారణంగా రాయదుర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే..
జూన్ 12వ తేదిన ఉదయం 8 గంటల ప్రాంతంలో రాయదుర్గంలోని మల్కంచెరువు ప్రధాన రహదారి మీదుగా ఓ వాహనదారుడు వెళ్తున్నాడు. రోడ్డు ఖాళీగానే ఉండడంతో బైక్ స్పీడ్‌ను పెంచాడు. ఇదే సమయంలో ఓ మహిళ రోడ్డు దాటేందుకు వచ్చింది. పాదాచారుల క్రాసింగ్ వద్ద కాకుండా నేరుగా డివైడర్ మీదుగా రోడ్డు మీదకు రావడంతో.. అటుగా వేగంగా వస్తున్న బైకర్ ఆమెను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదాన్ని ఉద్దేశిస్తూ.. సైబరాబాద్ పోలీసులు బుధవారం(జూన్ 16)న ట్వీట్ చేశారు. రహదారులను దాటడానికి డివైడర్ల మీదుగా క్రాస్ చేయకండి.. పాదచారుల క్రాసింగ్‌నే ఉపయోగించండి.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది.
Do not jump from dividers to cross the road.
Use pedestrian crossing.
A non fatal accident at Malkamcheruvu, Raidurgam.#RoadSafety #RoadSafetyCyberabad #Viral pic.twitter.com/i1CQjdDSCt— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 16, 2021