యాప్ డెవలపర్స్‌కు..కొ‘విన్’ చాలెంజ్

దిశ, వెబ్‌డెస్క్ : ‘కరోనా’‌కు సంబంధించిన ప్రతీ సమచారం అందించేందుకు టెక్నాలజీని పూర్తిస్థాయిలో ప్రభుత్వం వినియోగించుకుంటోంది. కొవిడ్ వైరస్‌ ట్రాకింగ్‌, వ్యాప్తి నిరోధిచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య తదితర అంశాలను ప్రజలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్యసేతు’ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌తో అందరికీ కొవిడ్ మీద అవగాహన రాగా, వ్యాక్సిన్ విషయాలు మాత్రం తెలియడం లేదు. దాంతో కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా కేంద్రం ప్రభుత్వం ‘కొవిన్’ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. వ్యాక్సిన్ […]

Update: 2020-12-25 05:17 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ‘కరోనా’‌కు సంబంధించిన ప్రతీ సమచారం అందించేందుకు టెక్నాలజీని పూర్తిస్థాయిలో ప్రభుత్వం వినియోగించుకుంటోంది. కొవిడ్ వైరస్‌ ట్రాకింగ్‌, వ్యాప్తి నిరోధిచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య తదితర అంశాలను ప్రజలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్యసేతు’ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌తో అందరికీ కొవిడ్ మీద అవగాహన రాగా, వ్యాక్సిన్ విషయాలు మాత్రం తెలియడం లేదు. దాంతో కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా కేంద్రం ప్రభుత్వం ‘కొవిన్’ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. వ్యాక్సిన్ పొందాలనుకునే వారు ఈ యాప్‌లో పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో యాప్‌ను మరింత సమర్థవంతంగా ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఒక చాలెంజ్ విసిరారు. ఆ చాలెంజ్ ఏంటీ? గెలుపొందిన వారికి వచ్చే ప్రైజ్‌మనీ ఎంత?

కరోనాను అరికట్టేందుకు వ్యాక్సిన్లు తయారవుతుండగా..కొన్ని త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ వ్యాక్సిన్ ఎవరెవరికి ఇస్తారు? టీకా ఎక్కడ పంపిణీ చేస్తారు? ఎలా పంపిణీ చేస్తారు? ఎంత మోతాదులో తీసుకోవాలి? ఏ టెంపరేచర్‌లో వ్యాక్సిన్‌ భద్రపరచాలి? ఎన్ని టీకాలు అందుబాటులో ఉన్నాయి? ఇలా సగటు మానవుని మెదుడలో బోలెడు ప్రశ్నలు గిర్రున తిరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఈ ప్రశ్నలకు చెక్ పెట్టేందుకు..కొవిడ్ వ్యాక్సిన్ సమాచారం, పంపిణీ విషయాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సాంకేతిక, సమాచార శాఖ సంయుక్తంగా ‘కొవిన్’ యాప్‌ను తీసుకొస్తున్నాయి. దీనికి మరింత సాంకేతికతను, సమర్థతను జోడించేందుకే కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ‘కొవిన్ చాలెంజ్’ విసిరారు.

ఇందులో భాగంగా యాప్ డెవలపర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. దీని కోసం డిసెంబర్ 23 నుంచి జనవరి 15, 2021 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆసక్తి ఉన్న యాప్ డెవలపర్స్, స్టార్టప్ కంపెనీలు మీఐటీఐస్టార్టప్‌హబ్. ఇన్(meitystartuphub.in )వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందులో గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికెట్‌తో పాటు, క్యాష్‌ప్రైజ్ అందిస్తున్నారు. విజేతకు రూ.40 లక్షలు ప్రైజ్ మనీ కాగా, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 20 లక్షలు, ఆ తర్వాత టాప్ 5 లో ఉన్న ముగ్గురికి రెండు లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News