ఫోన్ విషయమై అక్కాతమ్ముడి మధ్య గొడవ.. కోపంతో అక్క ఏంచేసిందంటే..?
దిశ, వెబ్‌డెస్క్: ఒక కుటుంబంలో తోబుట్టువులు ఉన్నారంటే వారి ఇద్దరిమధ్య అల్లరి అంతా ఇంతా కాదు. ప్రతి ఇంట్లో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల గొడవపడుతూనే ఉంటారు. అవన్నీ సరదాకు మాత్రమే.. కానీ ఒక్కోసారి అవి సీరియస్ గా మారి ప్రాణాల మీదకు తెస్తాయి. తాజాగా ఓ అక్క, తమ్ముడితో గొడవపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకొంది. క్షణికావేశంలో బాలిక తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబలో తీవ్ర ఆవేదనను నెలకొల్పింది. వివరాలలోకి వెళితే.. ఖమ్మం జిల్లా తల్లాడ […]
దిశ, వెబ్‌డెస్క్: ఒక కుటుంబంలో తోబుట్టువులు ఉన్నారంటే వారి ఇద్దరిమధ్య అల్లరి అంతా ఇంతా కాదు. ప్రతి ఇంట్లో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల గొడవపడుతూనే ఉంటారు. అవన్నీ సరదాకు మాత్రమే.. కానీ ఒక్కోసారి అవి సీరియస్ గా మారి ప్రాణాల మీదకు తెస్తాయి. తాజాగా ఓ అక్క, తమ్ముడితో గొడవపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకొంది. క్షణికావేశంలో బాలిక తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబలో తీవ్ర ఆవేదనను నెలకొల్పింది. వివరాలలోకి వెళితే..
ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన 15 ఏళ్ల బాలిక.. ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో తల్లిదండ్రుల వద్ద నుంచి బాలిక సెల్‌ఫోన్, ఇయర్ ఫోన్స్ తీసుకుంది. ఇంతలోనే ఇయర్ ఫోన్స్ కావాలని ఆమె తమ్ముడు(13) గొడవ మొదలుపెట్టాడు. వారిద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ కాస్తా వాగ్వాదంగా మారింది. ఇక వీరిద్దరికి ఎప్పుడు ఉండే గొడవే కదా అని తల్లిదండ్రులు సైతం ఆ విషయాన్నీ పట్టించుకోలేదు అదే వారు చేసిన తప్పు అయ్యింది. తమ్ముడు తనతో గొడవపడినందుకు మనస్థాపానికి గురైన బాలిక క్షణికావేశంలో తన ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు ఎంతసేపటికి బయటికి రావడంలేదని తల్లిదండ్రులు గది తలుపులు పగలకొట్టి చూడగా ఫ్యాన్ కి బాలిక విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. దీంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.