కరోనాతో చనిపోతున్నాం.. పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు

దిశ, ములుగు : జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ముందు మణుగూరు స్పెషల్ గెరిల్లా దళానికి చెందిన మడకం నంధాల్ మావోయిస్టు శుక్రవారం లొంగిపోయాడు. మడకం నంధాల్ @ నందు వయసు20 ఇతను చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామెడు మండంలం కోయ కౌరు గుట్ట గ్రామానికి చెందినవాడు. ఇతని చిన్నతనంలో తల్లి మరణించింది. మావోయిస్టు అనుబంధ సంస్థ బాలల సంఘంలో మూడు సంవత్సరాలు పని చేశాడు. తండ్రి బాగా తాగి […]

Update: 2021-06-04 02:48 GMT

దిశ, ములుగు : జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ముందు మణుగూరు స్పెషల్ గెరిల్లా దళానికి చెందిన మడకం నంధాల్ మావోయిస్టు శుక్రవారం లొంగిపోయాడు. మడకం నంధాల్ @ నందు వయసు20 ఇతను చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామెడు మండంలం కోయ కౌరు గుట్ట గ్రామానికి చెందినవాడు. ఇతని చిన్నతనంలో తల్లి మరణించింది. మావోయిస్టు అనుబంధ సంస్థ బాలల సంఘంలో మూడు సంవత్సరాలు పని చేశాడు. తండ్రి బాగా తాగి రోజు ఇతనిని కొట్టడం వల్ల ఇతని దగ్గర బంధువు పరిచయంతో పసర దగ్గర గుండ్ల వాగు ప్రాజెక్టు లో పని చేసుకుంటూ బూడిద గడ్డ గొత్తి కోయ గుంపులో ఉన్నాడు.

అనంతరం ఛత్తీస్ ఘడ్ లో సోముడు అనే మావోయిస్టు పరిచయం ద్వారా 2018 సంవత్సరంలో చెర్ల అరుణక్క దళంలో దళ సభ్యుడిగా చేరి సంవత్సరం పని చేసిన తర్వాత తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ అయిన ఆజాద్ ఆదేశాల మేరకు మణుగూరు దళంలో స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ లచ్చన్న కు గార్డుగా పని చేశాడు. లచ్చన్న కు గార్డుగా పనిచేసిన సమయంలో ఇతను బట్టుమ్ ఫైరింగ్, పెద్దమిడిసిలేరు రోడ్ బ్లాస్టింగ్ లో, జెర్రం ఏరియా టేకులగూడెం వద్ద జరిగిన కాల్పులలో 24 మంది సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్స్ చనిపోయిన సంఘటనలొ కూడా పాల్గొన్నాడు.

ఇతను అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సరైన వైద్యం అందక మావోయిస్టు పార్టీనీ విడాలని నిర్ణయించుకొని శుక్రవారం ములుగు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయాడు. లొంగిపోయిన అనంతరం ఇతనితో మాట్లాడగా మావోయిస్టు పార్టీలో చాలామంది కరోనా వ్యాధి తో బాధపడుతున్నారని మావోయిస్టు పార్టీ సరైన వైద్యం అందించకపోవడం వలన చాలామంది యూజీ క్యాడర్ మావోయిస్టులు మరణిస్తున్నారని తెలిపాడు. ఈ సందర్భంగా ఎస్పీమాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలను అందజేస్తామని మావోయిస్టులు అరణ్య వాసాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్‌డీఎస్పీ సాయి చైతన్య ములుగు సీఐ ఎస్ ఐలు ఉన్నారు.

Tags:    

Similar News