లైంగిక వేధింపుల కేసులో వ్యక్తికి 14 ఏళ్ల జైలు
దిశ,తెలంగాణ బ్యూరో : మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 58ఏళ్ల వ్యక్తికి 14 ఏళ్ల కఠిన జైలు శిక్షను విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ‘2017 అగస్టు 13న బాలిక తండ్రి నుంచి ఫిర్యాదు వచ్చిందని, ఆయనకి ఆరు సంవత్సరాల ఇద్దరు కవల కుమార్తెలున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో 58 ఏళ్ల ప్రగడి సంజయ్ మధ్యానం సమయంలో ఇంట్లోకి చొరబడి ఓ కూతిరిపై లైంగిక వేధింపులకు […]
దిశ,తెలంగాణ బ్యూరో : మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 58ఏళ్ల వ్యక్తికి 14 ఏళ్ల కఠిన జైలు శిక్షను విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ‘2017 అగస్టు 13న బాలిక తండ్రి నుంచి ఫిర్యాదు వచ్చిందని, ఆయనకి ఆరు సంవత్సరాల ఇద్దరు కవల కుమార్తెలున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో 58 ఏళ్ల ప్రగడి సంజయ్ మధ్యానం సమయంలో ఇంట్లోకి చొరబడి ఓ కూతిరిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. కేసును విచారించిన అప్పటి ఎల్బీనగర్ ఐవో కాసి రెడ్డి ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేశారు. రిమాండ్ లోకి తీసుకొని దర్యాప్తు పూర్తయ్యాక కోర్టులో చార్జిషీట్ ని సమర్పించారు’ అని తెలిపారు. ఈ కేసుకు సంబంధిన తీర్పును సోమవారం న్యాయమూర్తి బి.సురేష్ వెలువరించారు. నిందితుడికి 14 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానాను విధించారు. ఈ కేసు విచారణలో పాల్గొన్న ఐవో కాసి రెడ్డి, ఎల్బి నగర్ అదనపు సీపీ రాజిరెడ్డి హాజరయ్యారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, అడిషనల్ సీపీ సుధీర్ బాబులు వీరిని అభినందించారు.