దెయ్యాలు నన్ను చంపుతాయట.. పోలీస్ సారూ.. మీరే కాపాడాలి
దిశ, వెబ్‌డెస్క్: ప్రజలను కాపాడడానికి పోలీసులు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. ప్రజల రక్షణే వారి బాధ్యత. అయితే దొంగలను, హంతకులను పట్టుకోమంటే చిటికెలో పట్టుకుంటారు కానీ, దెయ్యాలను పట్టుకోండి అంటే వారు మాత్రం ఏం చేస్తారు. అదేంటి పోలీసులు దెయ్యాలను ఎందుకు పట్టుకుంటారు అనేగా డౌట్.. ఏం చేస్తారు పాపం.. ఆ పోలీస్ స్టేషన్ కి దెయ్యాలు తనను చంపడానికి వస్తున్నాయని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు మరీ.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దెయ్యాల కోసం […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రజలను కాపాడడానికి పోలీసులు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. ప్రజల రక్షణే వారి బాధ్యత. అయితే దొంగలను, హంతకులను పట్టుకోమంటే చిటికెలో పట్టుకుంటారు కానీ, దెయ్యాలను పట్టుకోండి అంటే వారు మాత్రం ఏం చేస్తారు. అదేంటి పోలీసులు దెయ్యాలను ఎందుకు పట్టుకుంటారు అనేగా డౌట్.. ఏం చేస్తారు పాపం.. ఆ పోలీస్ స్టేషన్ కి దెయ్యాలు తనను చంపడానికి వస్తున్నాయని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు మరీ.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దెయ్యాల కోసం వెతుకులాట కూడా ప్రారంభించారు. ఈ వింత ఘటన గుజరాత్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..
గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా జామ్‌బూగోడా తాలుకాకు చెందిన బరియా అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా రాత్రి పూత తన పంట పొలాలకు కాపలాగా వెళ్తున్నాడు. అయితే వారం రోజుల నుంచి అతనిని కొన్ని దెయ్యాలు వెంబడిస్తున్నాయట. అందులో రెండు దెయ్యాలు అయితే భయంకరంగా తనని చంపేస్తామని బెదిరిస్తున్నాయట. దీంతో భయపడిపోయిన బరియా పోలీసులను ఆశ్రయించాడు. తనను దెయ్యాలు చంపేస్తున్నాయి.. కాపాడండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయినా అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ విషయం అతనికి చెప్పకుండా సరే.. దెయ్యాలను వెతుకుతాం.. మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేశారు. ప్రస్తుతం ఈ దెయ్యం వార్త పంచమహల్ జిల్లాలో వైరల్ గా మారింది.