రిజల్ట్‌కు ముందే కాంగ్రెస్‌కు భారీ షాక్
దిశ ప్రతినిధి,వరంగల్ : ఎన్నికలకు.. ఎన్నికల తర్వాత రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్‌లు కొత్తేమీ కాదు. కానీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి.. ఇంకా ఫలితం వెలువడకముందే… ఫలితం ఎలా వస్తుందో రాదో కూడా తెలుసుకోక ముందే ముందస్తుగానే టీఆర్ ఎస్‌లోకి దూకేశాడు వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో నిలిచిన అభ్యర్థి. వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని 12 విడివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జూలూరి శ్రీధర్ శనివారం పార్టీ […]
దిశ ప్రతినిధి,వరంగల్ : ఎన్నికలకు.. ఎన్నికల తర్వాత రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్‌లు కొత్తేమీ కాదు. కానీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి.. ఇంకా ఫలితం వెలువడకముందే… ఫలితం ఎలా వస్తుందో రాదో కూడా తెలుసుకోక ముందే ముందస్తుగానే టీఆర్ ఎస్‌లోకి దూకేశాడు వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో నిలిచిన అభ్యర్థి. వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని 12 విడివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జూలూరి శ్రీధర్ శనివారం పార్టీ మారిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పార్టీ పదవుల్లో సముచితస్థానం కల్పిస్తాననే హామీతో శ్రీధర్ పార్టీ మారినట్లుగా తెలుస్తోంది. అయితే కనీసం ఫలితాలు వెల్లడయ్యేంత వరకు కూడా వెయిట్ చేయకుండా పార్టీ మారడంపై కాంగ్రెస్ వర్గాలు విస్మయం చెందుతున్నాయి. టికెట్ ఇప్పించిన నేతలపై తూర్పు నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న కొండా దంపతులు ఫైర్ అవుతున్నట్లు సమాచారం. ఫలితాలు వెల్లడికాకముందే ఇలా జంప్ అవుతున్న కాంగ్రెస్ అభ్యర్థులు.. అత్తెసరు సీట్లతో పార్టీలో ఉండి సాధించేదేముంటుందన్న నిర్ణయానికి వచ్చి జంప్ కారన్న నమ్మకమేముందన్న ప్రశ్నలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.