యజమాని కోసం ప్రాణత్యాగం చేసిన శునకం
దిశ, ఖమ్మం: విశ్వాసంలో కుక్కను మించిన జంతువు లేదంటారు. ఈ మాటను నిజమని నిరూపించే సంఘటన కల్లూరులో జరిగింది. నాగుపాము కాటు నుంచి యజమానిని రక్షించిన స్నూపి (కుక్క) తన ప్రాణాలను కోల్పోయింది. ఖమ్మం జిల్లా కల్లూరులో శనివారం జరిగిన ఈ సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కల్లూరు మండల కేంద్రంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న కిషోర్ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న వెనుక గదిలో నిద్రిస్తున్నాడు. ఇంట్లో ఏదో వింత శబ్దం రావడంతో స్నూపి(కుక్క) కిషోర్ […]
దిశ, ఖమ్మం: విశ్వాసంలో కుక్కను మించిన జంతువు లేదంటారు. ఈ మాటను నిజమని నిరూపించే సంఘటన కల్లూరులో జరిగింది. నాగుపాము కాటు నుంచి యజమానిని రక్షించిన స్నూపి (కుక్క) తన ప్రాణాలను కోల్పోయింది. ఖమ్మం జిల్లా కల్లూరులో శనివారం జరిగిన ఈ సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కల్లూరు మండల కేంద్రంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న కిషోర్ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న వెనుక గదిలో నిద్రిస్తున్నాడు. ఇంట్లో ఏదో వింత శబ్దం రావడంతో స్నూపి(కుక్క) కిషోర్ నిద్రిస్తున్న గదిలోకి వచ్చింది. స్నూపి అరుపుతో నిద్రలేచిన కిషోర్‌కు కేవలం మూడు అడుగుల దూరంలో నాగుపాము తనవైపు పడగవిప్పి నిలుచుని ఉంది. కిషోర్ షాక్ నుంచి తేరుకుని పక్కన ఉన్న కర్రను తీసుకుంటుండగానే పాము అతడిని కాటు వేసేందుకు ప్రయత్నం చేసింది. స్నూపి పామును నడుము భాగంలో నోట కరుచుకుని బయటకు తీసుకెళ్లింది. అయితే అప్పటికే పలుమార్లు కుక్కను ఆ పాము కాటు వేసింది. కిషోర్ పామును కర్రతో చంపేసి.. ఆ శునకాన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క తన ప్రాణాలను పణంగా పెట్టి నా ప్రాణాలను కాపాడిదంటూ కిషోర్ బోరున విలపించారు. కుక్క మరణంతో కిశోర్ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందో చెప్పేందుకు ఈ సంఘటన చాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.