పాఠశాలలో వింత రూల్.. టాయిలేట్‌కు వెళ్లాలంటే డాక్టర్ సర్టిఫికేట్ తప్పని సరి

దిశ, వెబ్‌డెస్క్ : పాఠశాలలో రూల్స్ అనేవి సహజం. పిల్లలు సక్రమంగా పాఠశాలకు రావాలని, విధిగా స్కూల్ యూనిఫామ్ ధరించాలని.. ఇలా పాఠశాలలో రూల్స్ అనేవి పెడుతూ ఉంటారు. అయితే ఓ స్కూల్‌లో పెట్టిన రూల్స్ చూసి షాక్ అయిన తల్లి దండ్రులు ఆ స్కూల్‌పై మండిపడుతున్నారు. ఇంతకీ ఆ రూల్ ఏంటీ అనుకుంటున్నారా.. ? వివరాల్లోకి వెళ్లితే.. ఇంగ్లాండ్‌ వేమౌత్‌లోని వైక్ రెగిస్‌లోని ఆల్ సెయింట్స్ స్కూల్‌ లో ఓ వింత రూల్‌ పెట్టింది యాజమాన్యం. […]

Update: 2021-09-21 03:07 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పాఠశాలలో రూల్స్ అనేవి సహజం. పిల్లలు సక్రమంగా పాఠశాలకు రావాలని, విధిగా స్కూల్ యూనిఫామ్ ధరించాలని.. ఇలా పాఠశాలలో రూల్స్ అనేవి పెడుతూ ఉంటారు. అయితే ఓ స్కూల్‌లో పెట్టిన రూల్స్ చూసి షాక్ అయిన తల్లి దండ్రులు ఆ స్కూల్‌పై మండిపడుతున్నారు. ఇంతకీ ఆ రూల్ ఏంటీ అనుకుంటున్నారా.. ?

వివరాల్లోకి వెళ్లితే.. ఇంగ్లాండ్‌ వేమౌత్‌లోని వైక్ రెగిస్‌లోని ఆల్ సెయింట్స్ స్కూల్‌ లో ఓ వింత రూల్‌ పెట్టింది యాజమాన్యం. పాఠశాలకు వచ్చే పిల్లలు.. క్లాస్ జరుగుతున్న సమయంలో బయటకు వెళ్లరాదని, టాయిలేట్‌కి వెళ్లడం కూడా కుదరదని చెప్పింది. అంతే కాకుండా ఒక వేళ టాయిలేట్ వెళ్లడం తప్పని సరి అయితే డాక్టర్ నుంచి ఏదైనా సర్టిఫికేట్ తీసుకరావాలని నిబంధనలు పెట్టింది. ఆ సర్టిఫికేట్ ఉన్నవారు మాత్రమే క్లాస్ మధ్యలో టాయిలేట్‌కి వెళ్లడానికి అనుమతి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ నిబంధనలు చూసి షాక్ అయిన విద్యార్థులు ఈ విషయాలను తమ తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆగ్రహానికిలోనైన తల్లిదండ్రులు పాఠశాలలో ఇలాంటి నిబంధనలు పెడుతారా.. ఆడపిల్లలకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి పరిస్థితో ఎలా.. అయినా ఈ డాక్టర్ సర్టిఫికేట్ ఏంటీ అని పాఠశాల యాజమాన్యంపై మండిపడుతున్నారు.

 

Tags:    

Similar News