హత్యలు చేశా.. అత్యాచారం చేశా

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మర్డర్ చేసిన వ్యక్తి ధైర్యంగా హత్య చేశానని, అయినా నన్ను పోలీసులు అరెస్ట్ చేయడం లేదని చెప్పకుంటూ.. ప్రచారం చేసుకుంటూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. దీంతో స్థానిక ప్రజలంతా అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వివరాళ్లోకి వెళితే… దక్షిణ కొరియాకు చెందిన లీ చున్ జే(57) అనే వ్యక్తి, మొత్తం 14 మందిని హత్యచేశానని, తనను శిక్షించాలని సువాన్ నగరంలోని కోర్టుకు తెలిపాడు. దక్షిణ కొరియా చట్టాలు అనుమానితులు, నేరస్థుల […]

Update: 2020-11-03 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మర్డర్ చేసిన వ్యక్తి ధైర్యంగా హత్య చేశానని, అయినా నన్ను పోలీసులు అరెస్ట్ చేయడం లేదని చెప్పకుంటూ.. ప్రచారం చేసుకుంటూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. దీంతో స్థానిక ప్రజలంతా అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వివరాళ్లోకి వెళితే… దక్షిణ కొరియాకు చెందిన లీ చున్ జే(57) అనే వ్యక్తి, మొత్తం 14 మందిని హత్యచేశానని, తనను శిక్షించాలని సువాన్ నగరంలోని కోర్టుకు తెలిపాడు. దక్షిణ కొరియా చట్టాలు అనుమానితులు, నేరస్థుల ప్రైవసీ హక్కుకు రక్షణ కల్పిస్తాయి. అందువల్ల నేరస్థుడి పూర్తి వివరాలను వెల్లడించలేదు. అంతేగాకుండా గతంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినందుకు నిందితుడికి జీవితకాల శిక్ష కూడా పడింది. కానీ 20 ఏండ్ల జైలు జీవితం గడిపిన తర్వాత, 2008లో అతడు పెరోల్‌పై బయటకు వచ్చాడు. 1986 నుంచి 1991 మధ్య హ్వాసెంగ్ ప్రాంతంలో 10 హత్యలు చేశాడు.

ఈ వరుస హత్యలను అక్కడి ప్రజలు హ్వాసెంగ్ మర్డర్స్ అని పిలుస్తారు. వీటితో కలిపి మొత్తం 14 మందిని చంపినట్టు అతడు చెప్పాడు. కానీ ఈ హత్యలకు సంబంధించిన కేసులను పోలీసులు ఇంకా పరిష్కరించలేదు. ఈ సీరియల్ కిల్లింగ్స్‌పై 2003లో మెుమోరీస్ ఆఫ్ మర్డర్ పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది. దీంతో ఆ హత్యలు ఎంత సంచలనం సృష్టించాయో అర్ధం చేసుకోవచ్చు. 2019లో డీఎన్‌ఏ ఆధారాల సాయంతో పోలీసులు లీ చేసిన కొన్ని హత్యలపై దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. అతడిపై విచారణ కొనసాగుతోంది. హత్యల గురించి పోలీసులు తనను ప్రశ్నించారని లీ సోమవారం తెలిపాడు. తన చేతుల్లో హతమైన ఒక వ్యక్తి వాచ్‌ను ఇప్పటికీ తీసుకువెళ్తున్నానని అతడు చెప్పడం విశేషం. అయితే ఇప్పటికైనా అతడు హత్యలు చేసినట్టు పోలీసులు కోర్టులో నిరూపిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News