చిన్నారి ప్రతిభకు కళగా మెరిసిన ఇళ్లు

దిశ,ఆసిఫాబాద్: కరోనా మహమ్మారి కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ ఎఫెక్ట్‌తో జనాలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది టీవీలు, సెల్‌ఫోన్‌లతో కాలాక్షేపం చేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో ఆసిఫాబాద్ పట్టణంలోని రాజంపేటకి చెందిన సిహెచ్. అశ్విని మాత్రం తన ప్రతిభకు మెరుగులు దిద్దింది. వినూత్న ఆలోచనలతో తన ఇంటికే కళ తీసుకొచ్చింది. అదే ఎలా అనుకుంటున్నారా… తెల్ల కాగితాలను ఉపయోగించి షోకేస్ ప్లవర్స్‌ను […]

Update: 2021-05-23 07:55 GMT

దిశ,ఆసిఫాబాద్: కరోనా మహమ్మారి కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ ఎఫెక్ట్‌తో జనాలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది టీవీలు, సెల్‌ఫోన్‌లతో కాలాక్షేపం చేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో ఆసిఫాబాద్ పట్టణంలోని రాజంపేటకి చెందిన సిహెచ్. అశ్విని మాత్రం తన ప్రతిభకు మెరుగులు దిద్దింది. వినూత్న ఆలోచనలతో తన ఇంటికే కళ తీసుకొచ్చింది.

అదే ఎలా అనుకుంటున్నారా…

తెల్ల కాగితాలను ఉపయోగించి షోకేస్ ప్లవర్స్‌ను తయారుచేసింది. అలానే ప్లాస్టిక్ టీ కప్పులు, అగ్గి పెట్ట డబ్బలతో అలంకార వస్తువులను తయారు చేసి ఇంట్లో షోకేస్‌గా అమర్చింది. ఆ చిట్టి తల్లి ఉపాయంతో తయారు చేసిన వస్తువులను చూసిన వారందరూ ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు. ఖాళీగా ఉన్న సమయంలో ఇలాంటివి ఎన్నో తయారు చేయవచ్చని, ఏ వస్తువులూ అనవసరంగా ఉండవని వాటితో ఇలా ఇంటికి ఉపయోగ పడే విధంగా ఏదో ఒకటి చెయచ్చు అని నిరూపించిందని చూసినవారు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags:    

Similar News