మాస్కు‌కు నో ఖర్చు.. చిన్నారి ఉపాయం

దిశ, ఆదిలాబాద్: కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న మాస్కుల కొరత, అధిక ధరల బాధను తీర్చేందుకు ఓ చిన్నారి చక్కటి ఉపాయం కనుగొన్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు టీవీలో, ప్రసారమాధ్యమాల్లో మాస్క్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోందని మెడికల్ షాపుల్లో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని గమనించిన 11ఏళ్ల బాలిక చిన్న ఉపాయంతో మాస్క్ తయారు చేసుకోవచ్చని నిరూపించింది. కొంచెం పెద్ద సైజు కర్చీఫ్‌ను మడిచిపెట్టి రెండు వైపులా హెయిర్ […]

Update: 2020-03-16 03:52 GMT

దిశ, ఆదిలాబాద్: కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న మాస్కుల కొరత, అధిక ధరల బాధను తీర్చేందుకు ఓ చిన్నారి చక్కటి ఉపాయం కనుగొన్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు టీవీలో, ప్రసారమాధ్యమాల్లో మాస్క్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోందని మెడికల్ షాపుల్లో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని గమనించిన 11ఏళ్ల బాలిక చిన్న ఉపాయంతో మాస్క్ తయారు చేసుకోవచ్చని నిరూపించింది. కొంచెం పెద్ద సైజు కర్చీఫ్‌ను మడిచిపెట్టి రెండు వైపులా హెయిర్ బ్యాండ్‌ల సాయంతో మాస్క్ తయారు చేసి చూపింది. నిర్మల్‌కు చెందిన జర్నలిస్టు కొండూరి రవీందర్ కూతురు వంశిక ఈ సులువైన పద్దతిలో మాస్క్ తయారు చేసి చూపింది. ఇది తక్కువ ధరతో తయారు అవుతుండడంతో పాటు, ప్రతిఒక్కరూ ఇంట్లోనే తయారుచేసి ఉపయోగించేలా ఉండటంతో ఈ చిట్కాను ఉపయోగకరంగా ఉందని, అందరూ శభాశ్ అంటూ అభినందిస్తున్నారు.

Tags : child, made to mask, without cost, adilabad, carona virus, Daughter of journalist

Tags:    

Similar News