లైవ్‎లో బాలుడు ఏం చేశాడో తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్: బీచ్‌లో న్యూస్ కవర్ చేస్తున్న రిపోర్టర్‌కి ఓ బాలుడు షాక్ ఇచ్చాడు. బీచ్, అక్కడి ప్రత్యేకతను తెలుపుతున్న సమయంలో వెనకాలే ఉన్న బాలుడు ఏకంగా వీడియోలో కనబడేలా అల్లరి చేష్టలు చేశాడు. పేరు గాంచిన బీబీసీ న్యూస్ ఛానెల్ ప్రజెంటర్‌కు ఈ విధమైన పరిణామం ఎదురైంది. బీబీసీకి చెందిన జెన్ బార్త్రామ్ అనే న్యూస్ రిపోర్టర్ యూకేలోని సౌత్ షీల్డ్స్ నుంచి లైవ్ ఇస్తోంది. ఇదే సమయంలో అక్కడే ఉన్న బాలుడు కెమెరాలో కనిపించేలా […]

Update: 2020-08-05 07:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీచ్‌లో న్యూస్ కవర్ చేస్తున్న రిపోర్టర్‌కి ఓ బాలుడు షాక్ ఇచ్చాడు. బీచ్, అక్కడి ప్రత్యేకతను తెలుపుతున్న సమయంలో వెనకాలే ఉన్న బాలుడు ఏకంగా వీడియోలో కనబడేలా అల్లరి చేష్టలు చేశాడు. పేరు గాంచిన బీబీసీ న్యూస్ ఛానెల్ ప్రజెంటర్‌కు ఈ విధమైన పరిణామం ఎదురైంది.

బీబీసీకి చెందిన జెన్ బార్త్రామ్ అనే న్యూస్ రిపోర్టర్ యూకేలోని సౌత్ షీల్డ్స్ నుంచి లైవ్ ఇస్తోంది. ఇదే సమయంలో అక్కడే ఉన్న బాలుడు కెమెరాలో కనిపించేలా చిందులు వేశాడు. తన అల్లరి చేష్టలు ఆ ప్రోగ్రాంలో మొత్తం రికార్డు అయ్యాయి. ఇది గమనించిన రిపోర్టర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ.. ఆ బాలుడు చేసిన చిందులకు తగ్గట్టుగా మ్యూజిక్ పెట్టి షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Tags:    

Similar News