NFT రూపంలో..అమ్మకానికి అమ్మతనం..

దిశ, ఫీచర్స్: ఇప్పటివరకు మూవీస్, సీన్స్, వీడియో క్లిపింగ్స్, చివరకు ఇద్దరు సెలబ్రిటీల మధ్య చాట్‌ను ఎన్‌ఎఫ్‌టీ రూపంలో అమ్మకానికి పెట్టడం చూశాం. కానీ 42 ఏళ్ల మహిళ కొత్తగా తన అండాన్ని ఎన్‌ఎఫ్‌టీ రూపంలో విక్రయించాలని అనుకుంటోంది. తద్వారా ఓ బిడ్డకు వెల్‌కమ్ చెప్పాలని భావిస్తోంది. అమెరికాకు చెందిన నరైన్ అరాకెలియన్ లాస్ ఏంజిల్స్‌ నివాసి. స్వతహాగా ఆర్టిస్ట్ అయిన తాను.. ‘Love – Hope – Live’ అనే పెయింటింగ్‌ క్రియేట్ చేసి, ఫ్లోరిడా మియామిలోని […]

Update: 2021-12-12 03:34 GMT

దిశ, ఫీచర్స్: ఇప్పటివరకు మూవీస్, సీన్స్, వీడియో క్లిపింగ్స్, చివరకు ఇద్దరు సెలబ్రిటీల మధ్య చాట్‌ను ఎన్‌ఎఫ్‌టీ రూపంలో అమ్మకానికి పెట్టడం చూశాం. కానీ 42 ఏళ్ల మహిళ కొత్తగా తన అండాన్ని ఎన్‌ఎఫ్‌టీ రూపంలో విక్రయించాలని అనుకుంటోంది. తద్వారా ఓ బిడ్డకు వెల్‌కమ్ చెప్పాలని భావిస్తోంది. అమెరికాకు చెందిన నరైన్ అరాకెలియన్ లాస్ ఏంజిల్స్‌ నివాసి. స్వతహాగా ఆర్టిస్ట్ అయిన తాను.. ‘Love – Hope – Live’ అనే పెయింటింగ్‌ క్రియేట్ చేసి, ఫ్లోరిడా మియామిలోని ఆర్ట్ బాసెల్‌‌లో అమ్మకానికి ప్రదర్శించింది. ఈ పెయింటింగ్ సొంతం చేసుకున్నవారు తన రీప్రొడక్టివ్ ఎగ్స్‌లో ఒకదాన్ని సొంతం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

అంతేకాదు ఈ ఎగ్‌‌ను కొనుగోలు చేసిన వారు తప్పకుండా యూజ్ చేయాలని, తద్వారా బేబీని పొందాలని కోరుతోంది. కాగా ఈ ఎన్‌ఎఫ్‌టీని ఆమె వేలం పాట ద్వారా సేల్‌కు పెట్టడం విశేషం. కాగా తన వర్క్ ద్వారా ఒక బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకురావడం ఎగ్జయిటింగ్‌గా ఉందన్న ఆమె.. సంతానోత్పత్తి కోసం కష్టపడుతున్న జంటకు ఈ అండాన్ని విక్రయించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఆర్ట్ అండ్ లైఫ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం క్రియేటివ్‌లీ బ్యూటిఫుల్ ఆర్ట్ అన్న నరైన్.. ముఖ్యంగా కొనుగోలు చేసిన వ్యక్తికి మరింత ప్రత్యేకమని తెలిపింది. ఎందుకంటే ఈ ఎన్‌ఎఫ్‌టీనే తమకు బిడ్డను తీసుకురాబోతోందని, జీవితాంతం మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపింది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..