IPL 2025 : సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్.. నితీశ్‌కు ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చిన బీసీసీఐ

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్.

Update: 2025-03-15 13:22 GMT

దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్. ఆ జట్టు ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతనికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చినట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. జనవరి నుంచి అతను ఆటకు దూరంగా ఉన్నాడు. పక్కటెముకల నొప్పితో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ నుంచి మధ్యలోనే వైదొలిన విషయం తెలిసిందే. రెండో టీ20 కోసం ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌కు ముందు అతని ఫిట్‌నెస్ అనుమానాలు వచ్చాయి. అయితే, తాజాగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నితీశ్ అన్ని ఫిట్‌నెస్ టెస్టులను విజయవంతంగా పూర్తి చేశాడు. యో యో టెస్టులోనూ పాస్ అయ్యాడు. దీంతో నితీశ్ త్వరలోనే ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో చేరనున్నాడు. గత సీజన్‌లో హైదరాబాద్ విజయాల్లో అతను కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 13 మ్యాచ్‌ల్లో 303 రన్స్ చేయడంతోపాటు 3 వికెట్లు కూడా తీశాడు. దీంతో ఈ సీజన్ కోసం హైదరాబాద్ ఫ్రాంచైజీ అతన్ని రూ. 6 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ నెల 23న ఎస్‌ఆర్‌హెచ్ తమ తొలి గ్రూపు మ్యాచ్‌లో రాజస్థాన్‌తో తలపడనుంది.


Tags:    

Similar News