Crime : ఊర చెరువులో గుర్తు తెలియని మహిళ శవం…హత్య..ఆత్మహత్య..?

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రంలోని ఊర చెరువులో గుర్తు తెలియని మహిళ శవం శనివారం కలకలం రేపింది.

Update: 2024-09-07 08:59 GMT

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రంలోని ఊర చెరువులో గుర్తు తెలియని మహిళ శవం శనివారం కలకలం రేపింది. ఈ ప్రమాదంపై గురు స్వామి తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆ మృతురాలిని పరిశీలించగా నలుపు, తెలుపు రంగు చుక్కల టాప్, నలుపు రంగు లెగ్గిన్ కలిగి ఉందని, శవం ఎత్తు ఐదు ఫీట్ల రెండు ఇంచులు కలదన్నారు. నీటిలో మునిగి ఉండడం వల్ల శవం బాగా ఉబ్బి ఉందని, కుడి చేతికి ఆకుపచ్చ రంగు గాజు, ఎడమ కాలికి నల్లదారం దారానికి గజ్జలు ఉన్నాయన్నారు. ఈ శవం వయసు అందాజ 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండవచ్చుని, మృతురాలి వివరాలు ఎవరికైనా తెలిస్తే ఈ క్రింది ఫోన్ నెంబర్ ఎస్సై బల్మూరు 8712657736, అచ్చంపేట సీఐ 8712657731 నంబర్లను సంప్రదించాలని సూచించారు. గుర్తు తెలియని మహిళ మృతురాలు కుటుంబ కారణాల లేక ఎవరైనా చంపేసి ఉంటారా ? ఇంకేమైనా జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతురాలి బంధువులు గుర్తించి వస్తే కానీ అసలు విషయాలు బయటకి వస్తుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.


Similar News