గుర్తుతెలియని మృతదేహం లభ్యం..

పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారు జగ్గారావు ఫారం

Update: 2024-04-01 16:33 GMT

దిశ, నవీపేట్: పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారు జగ్గారావు ఫారం సమీపంలో గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు ఎస్సై యాదగిరి గౌడ్ సోమవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాపూర్ గ్రామ కారోబార్ సతీష్ ఫిర్యాదు మేరకు ఎస్సై యాదగిరి గౌడ్ సంఘటన స్థలానికి వెళ్లి చూడగా సుమారు 50- 55 సంవత్సరాల వయస్సు గల మగ మనిషి బ్లూ కలర్ గీతల షర్ట్, నల్లటి ప్యాంట్ ధరించి ఉన్నాడని, పాస్పోర్ట్ సైజ్ ఫోటో జేబులో దొరికిందని తెలిపారు. గుర్తుతెలియని మగ మనిషి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే నవీపేట్ పోలీసులకు సంప్రదించాలని కోరారు. మల్కాపూర్ కారోబార్ సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Similar News