ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్.. ఏడు వాహనాలు స్వాధీనం

ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని

Update: 2024-07-05 14:02 GMT

దిశ,పేట్ బషీరాబాద్: ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల్ రాజ్ పేట గ్రామానికి చెందిన బోలా నవీన్ (20) ఉపాధి నిమిత్తం జీడిమెట్ల డివిజన్ అంగడిపేట లో ఉంటూ డ్రైవర్గా పని చేస్తూ ఉండేవాడు. అతనికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడటానికి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నాడు. ద్విచక్ర వాహనాలు దొంగతనాలపై దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు వాహన తనిఖీలలో నవీన్ అనుమాన స్పదంగా కనిపించడంతో అతని అదుపులోకి తీసుకొని విచారించారు.

విచారంలో అతను దొంగతనానికి పాల్పడిన వాహన వివరాలను వెల్లడించడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు, సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ విజయవర్ధన్, డి ఎ నరసింహరాజు క్రైమ్ ఎస్సై నర్సింహులు, ఎస్సై ప్రవీణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, రవి కిషోర్, కానిస్టేబుల్ గణపతి, కిషోర్ రెడ్డి, విజయలక్ష్మిలను మేడ్చల్ జోన్ డిసిపి కోటిరెడ్డి అభినందించారు.


Similar News