Suspend : ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్..!

మెదక్ పట్టణ పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు.

Update: 2024-07-24 08:23 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ పట్టణ పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు. మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన కానిస్టేబుళ్లు నీరుడి రాము, రవి ఓ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుడి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు వచ్చింది. దానిపై విచారణ చేపట్టగా కానిస్టేబుళ్లు డబ్బులు డిమాండ్ చేసింది నిజమని తేలడంతో వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా సిబ్బంది ఎవరు కూడా పోలీస్ శాఖకు చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించకూడదని, అలా ఎవరైనా చేస్తే వారిపై శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


Similar News