'స్పా సెంటర్' యాజమాన్యాని బెదిరింపు.. నకిలీ పోలీస్ అరెస్ట్

నకిలీ పోలీస్‌ను అరెస్ట్ చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2023-10-11 16:13 GMT

దిశ, మేడిపల్లి: నకిలీ పోలీస్‌ను అరెస్ట్ చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సద్భావన టౌన్ షిప్ జోడిమెట్ల కి చెందిన మారుడి మధుసూదన్ రెడ్డి (36) తండ్రి రంగా రెడ్డి పోలీస్ అవతారం ఎత్తాడు. మేడిపల్లి మండలం పిర్జాదిగూడ కు చెందిన బ్యూటి అండ్ స్పా సెంటర్‌లో తను టాస్క్ ఫోర్స్ పోలీస్‌గా పరిచయం చేసుకొని స్పా సెంటర్ యాజమాన్యాన్ని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో స్పా యాజమాన్యం ఫిర్యాదు మేరకు నకిలీ పోలీస్‌ను బుధవారం నాడు ఎస్‌ఓటీ అరెస్ట్ చేశారు. నిందితుడు నుండి ఒక ఏయర్ పిస్టోల్, 5,800 నగదు, ఒక చరవాణి స్వాధీనం చేసుకుని.. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.


Similar News