రూ.16,180 కోట్ల ఘరానా మోసం.. ఇద్దరి అరెస్ట్

Update: 2023-10-13 17:12 GMT

ముంబై : వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా రూ.16,180 కోట్ల ఘరానా మోసానికి పాల్పడిన అనూప్ దూబే, సంజయ్ నామ్ దేవ్ గైక్వాడ్ లను మహారాష్ట్రలోని థానే పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ ఒక మనీ ట్రాన్స్‌ఫర్ కంపెనీ పేమెంట్ గేట్‌వేను హ్యాక్ చేశారు. అనంతరం బోగస్ డాక్యుమెంట్లతో ఐదు పార్ట్నర్ షిప్ సంస్థలను ఏర్పాటు చేయించారు. ఆ సంస్థల పేరిట బ్యాంకు అకౌంట్లను తెరిపించి.. వాటిలోకి పేమెంట్ గేట్ వే నుంచి డబ్బులను పంపించారు.

ఐదు పార్ట్నర్ షిప్ సంస్థల బ్యాంకు అకౌంట్లతో ముడిపడిన 260 స్టేట్మెంట్లను జల్లెడపట్టిన పోలీసులు.. వాటి ద్వారా ఏకంగా రూ.16వేల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని గుర్తించారు. తమ సంస్థ అకౌంట్లలో రూ.25 కోట్ల చీటింగ్ జరిగిందంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో సదరు మనీ ట్రాన్స్‌ఫర్ కంపెనీ నుంచి థానే పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసును విచారణ చేసిన పోలీసులు.. ఫిర్యాదులో ప్రస్తావించిన దాని కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ రేంజ్‌లో నిధులు అక్రమంగా దారిమళ్లాయని గుర్తించారు.Thane police arrest KYC expert in cheating case linked with cyber fraud


Similar News