తెలుగు సినీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్నవర్మ ఆత్మహత్య

సినిమాలలో రాణించాలని ఎన్నో ఆశలతో హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ యువతి సరైన అవకాశాలు లేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-07-06 09:38 GMT

దిశ, శేరిలింగంపల్లి : సినిమాలలో రాణించాలని ఎన్నో ఆశలతో హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ యువతి సరైన అవకాశాలు లేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి ప్రాథమిక వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన స్వప్నవర్మ (33) గత మూడు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తూ గత సంవత్సరం మాదాపూర్ కావూరి హిల్స్ తీగల హౌస్ 101 ప్లాట్ లో ఒంటరిగానే ఉంటుంది. పలు సినిమాలకు

    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. అయితే గత ఆరు నెలలుగా ఏ ప్రాజెక్టు లేకుండా ఖాళీగా ఉన్న స్వప్నవర్మ ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో రెండు రోజుల క్రితం తన ప్లాట్ లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బాడీ డీ కంపోజ్ అయ్యి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్వప్నవర్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 


Similar News