నిమ్స్ లో అడిషనల్ ప్రొఫెసర్ ఆత్మహత్య

నిమ్స్ లో విధులు నిర్వహించే అనెస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు.

Update: 2024-07-06 09:11 GMT

దిశ, ఖైరతాబాద్ : నిమ్స్ లో విధులు నిర్వహించే అనెస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో మత్తు ఇంజక్షన్​ మొతాదుకు మించి తీసుకున్నారు. గమనించిన కుటుంబీకులు చికిత్స కోసం వెంటనే నిమ్స్ కి తరలించారు. కాగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 


Similar News