మేనల్లుడు లేచిపోతే...మామకు టార్చర్​

మీ అల్లుడు మరో యువతిని తీసుకెళ్లాడని, వారి జాడ చెప్పాలని రెయిన్​ బజార్​ పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ వృద్ధుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-09-07 14:49 GMT

దిశ, చార్మినార్​ : మీ అల్లుడు మరో యువతిని తీసుకెళ్లాడని, వారి జాడ చెప్పాలని రెయిన్​ బజార్​ పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ వృద్ధుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రెయిన్​ బజార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో శనివారం ఉదయం తీవ్ర కలకలం రేపింది. ‘నిన్న రాత్రి నా కూతురుకు ఫోన్​ చేసి తీసుకుపోతాం అని రెయిన్​ బజార్​ పోలీసులు బెదిరించారు. ఇందులో మా తప్పేమీ లేదని, వాళ్లు ఎక్కడికి వెళ్లారో తెలియదని చెప్పినా నమ్మడం లేదు. మీరు పెట్టే టెన్షన్​ మేము భరించలేక పోతున్నాం... టెన్షన్​తో మేము ఎం చేస్తున్నామో మాకే అర్ధం కావడం లేదు.

    నేను షాపు​కు కూడా వెళ్లలేక పోతున్నాను...నా కూతురు, మా కుటుంబం మీద దయ చూపెట్టండి ...నేను సూసైడ్​ చేసుకుంటున్నాను’ అంటూ తీసిన సెల్ఫీ వీడియో వైరల్​గా మారింది. వివరాలలోకి వెళితే... పాతబస్తీ యాకుత్​పురా ఎస్​ఆర్​టీ కాలనీకి చెందిన యూనుస్​ ఖాన్​ (75) సోదరి కుమారుడు నాలుగు నెలల క్రితం అల్లుడు ఒక యువతిని ప్రేమ పేరుతో తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించకపోవడంతో యువతి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు యూసుఫ్​ ఖాన్​ కుటుంబంపై రెయిన్​ బజార్​ పోలీసులు గత నెలరోజులుగా తీవ్ర ఒత్తిడి చేయసాగారు. శుక్రవారం రాత్రి కూడా మరో మారు రెయిన్​ బజార్​ పోలీసులు ఫోన్​ చేసి వాళ్ల ఆచూకీ చెప్పక పోతే స్టేషన్​కు తీసుకువెళ్తాం అని బెదిరించారు. దీంతో అప్పటికే టెన్షన్​ లో ఉన్న యూనుస్​ ఖాన్​ శనివారం ఉదయం సెల్ఫీ వీడియో తీసి మరీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసును రెయిన్​బజార్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News