ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీహెచ్ఎంసీ కార్మికుడు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీహెచ్ఎంసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-07-06 15:09 GMT

దిశ, చార్మినార్ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీహెచ్ఎంసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కందికల్ భట్ జీ నగర్ కు చెందిన వినోద్ (35) జీహెచ్ఎంసీ కార్మికుడిగా పనిచేసేవాడు. గత మూడు నెలల నుంచి జీహెచ్ఎంసీ అధికారులు కొంత మంది సిబ్బందిని సుదూర ప్రాంతంలోని

     డీఆర్ఎఫ్ కి పంపించిన వారిలో వినోద్ కూడా ఉన్నాడు. గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్న వినోద్ శుక్రవారం రాత్రి ఇంట్లోని దూలానికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా జీహెచ్ఎంసీ అధికారుల కక్ష సాధింపు చర్యల కారణంగానే వినోద్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


Similar News