ఎక్సైజ్ అధికారుల విస్తృత తనిఖీలు..8 కేసులు సహా అదుపులోకి ఆరుగురు

నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అధికారులు శనివారం విస్తృత

Update: 2024-07-06 11:45 GMT

దిశ,నర్సంపేట : నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అధికారులు శనివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. దుగ్గొండి మండలంలోని నారాయణ తండా, నర్సంపేట మండలంలోని చంద్రయ్య పల్లి, పర్ష నాయక్ తండా, నర్సంపేట పట్టణం, నెక్కొండ మండలం చెరువు ముందరి తండా, చిన్నకొర్పోలు గ్రామాల్లో స్టేట్ టాస్క్ ఫోర్స్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్, వరంగల్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ అధికారులు కలిసి దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నాటు సారా తయారీ దారులను, రవాణా దారులు, ముడి సరుకు అమ్మకం దారుల వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులలో మొత్తం 8 కేసులు నమోదు చేసినట్లు, మొత్తం 6 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నరేష్ రెడ్డి తెలిపారు.

ఈ దాడుల్లో 20 లీటర్ల నాటు సారా, 300 కేజీల చక్కెర, 10 కేజీల పటిక, 12 కేజీల డ్రై ఈస్ట్ మరియు ఒక ద్వి చక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. 1600 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేసినట్లు సీఐ స్పష్టం చేశారు. ఈ దాడులలో నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి, స్టేట్ టాస్క్ ఫోర్స్ సీఐ భిక్ష రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సీఐ నాగయ్య, టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ చందర్, ఎస్సైలు శార్వాణి, రజిత, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News