సూర్యాపేటలో వృద్ధురాలిని టార్గెట్ చేసిన యువకుడు.. రెడ్ హ్యాండెడ్‌గా బుక్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటీవల దొంగలు హల్చల్ చేస్తున్నారు. రాత్రనక, పగలనక దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారనడానికి వరుసగా రెండవ రోజు రెండు ప్రాంతాల్లో జరిగిన ఘటనలే నిదర్శనం.

Update: 2024-08-17 08:19 GMT

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటీవల దొంగలు హల్చల్ చేస్తున్నారు. రాత్రనక, పగలనక దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారనడానికి వరుసగా రెండవ రోజు రెండు ప్రాంతాల్లో జరిగిన ఘటనలే నిదర్శనం. 1వ వార్డులోని పీఎన్ఆర్ కాలనీలో రాత్రిళ్లు గోడకు కన్నం వేసి దొంగతనానికి పాల్పడ్డ ఘటన మరవక ముందే శనివారం పట్టణనడిబొడ్డున ఓ దొంగ పట్టపగలే వృద్ధురాలు మెడలో నుంచి బంగారు గొలుసును దొంగిలించాడు. దీన్ని గమనించిన యువకులు అతన్ని వెంబడించి దొంగను పట్టుకొని చితకబాదగా గొలుసు తిరిగి వృద్ధురాలికి ఇచ్చాడు.

కాగా వృద్ధురాలు చంద్రకళను దొంగతనం ఎలా జరిగిందని ప్రశ్నించగా తానూ విద్యనగర్ నుంచి 60 ఫీట్ల రోడ్డు మీదుగా నలంద జూనియర్ కలశాల వద్ద నుంచి డీమార్ట్‌కు వెళ్తున్నానని, అతను కొంత దూరం తన వెంటే వచ్చాడని చెప్పింది. నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో దొంగ తన మెడలో నుంచి సుమారు రెండున్నర గ్రాములున్న బంగారు గొలుసును తీసుకొని పారిపోతుండగా తాను అరవడంతో కొంతమంది యువకులు వచ్చి అతన్ని పట్టుకున్నట్లు వివరించింది. దొంగను చితకబాది అడ్రస్ అడగగా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్పి నోరు మూశాడు. దీనితో యువకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగ చేసిన పోలీసులు దొంగను స్టేషన్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తు మేరకు ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News