మద్యం మత్తులో దాడి పాల్పడిన యువకులు అరెస్ట్

శనివారం రాత్రి మద్యం సేవించి మత్తులో భక్తులపై దాడి చేసిన వారిని

Update: 2024-07-02 12:52 GMT

దిశ,కొమురవెల్లి : శనివారం రాత్రి మద్యం సేవించి మత్తులో భక్తులపై దాడి చేసిన వారిని కొమురవెల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మంగళవారం ఎస్సై రాజు గౌడ్ తో కలిసి కొమురవెల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చేర్యాల సీఐ శ్రీను మాట్లాడుతూ.. కొమురవెల్లి గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు దేశెట్టి వినయ్,సార్ల నవీన్, పేర్ని శివమణి,పండుగ పవన్,రంగు రాజు,చిర్ల శ్రీకాంత్,దేశెట్టి నవీన్, లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. వీరితోపాటు వీళ్ళు ఉపయోగించిన టాటా ఏసీ వాహనం, ఐరన్ రాడ్,కర్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

వీరిపై గతంలో రాష్ డ్రైవింగ్, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు ఉన్నాయని,వీరి పైన రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నామని సీఐ శ్రీను తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని,మైనర్లకు ఎలాంటి వాహనాలు కూడా ఇవ్వకూడదని పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించాలని కోరారు. మల్లన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తారని భక్తులు ఎవరు కూడా భయపడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై రామ్మూర్తి, హెడ్ కానిస్టేబుల్ బాబు గౌడ్, కానిస్టేబుల్ తిరుపతి,లడ్డు బాబు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Similar News