16.1 కిలోల గంజాయి పట్టివేత

ఒరిస్సా నుంచి బస్సులో హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేస్తున్న 16.1 కిలోల గంజాయిని గురువారం ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్ మెంట్‌ ఎస్టీఎఫ్​ పోలీసులు పట్టుకున్నారు.

Update: 2024-07-04 14:07 GMT

దిశ, హయత్ నగర్ : ఒరిస్సా నుంచి బస్సులో హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేస్తున్న 16.1 కిలోల గంజాయిని గురువారం ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్ మెంట్‌ ఎస్టీఎఫ్​ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒరిస్సా నుంచి బస్సులో రూ. 3 లక్షల విలువ చేసే గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు హయత్ నగర్ ప్రాంతంలో పట్టుకున్నట్లు ఎస్టీఎఫ్ టీమ్‌ లీడర్‌ ఎన్‌. అంజి రెడ్డి తెలిపారు. గంజాయిని ఒరిస్సా నుంచి హైదరాబాద్‌ తీసుకువచ్చిన జయదేవ్‌ నెలూర్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ధూల్ పేట్ లోని అశోక్‌సింగ్‌కు విక్రయించేందుకు తెచ్చినట్టు తెలిపాడు.

     అశోక్‌ సింగ్‌ పరారీలో ఉన్నట్టు తెలిపారు. గతంలో హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని గంజాయి అమ్మకాలు సాగించే ఒరిస్సా ప్రాంతానికి చెందిన మిలన్‌దేవ్‌నాథ్‌ అనే వ్యక్తి దీనికి సూత్రధారని పేర్కొన్నారు. ఈ కేసులో గంజాయిని తీసుకొచ్చిన వ్యక్తితో పాటు కొనుగోలు చేసిన అశోక్‌సింగ్‌, గంజాయిని పంపించిన మిలన్‌దేవ్‌నాథ్‌పై కేసులు నమో దు చేసినట్లు తెలిపారు. కొత్తగా వచ్చిన ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ చట్టాల ప్రకారం

    వీడియో తీయించి పకడ్బందీగా కేసును నమోదు చేసినట్లు తెలిపారు. ఈ గంజాయిని పట్టుకున్న వారిలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ఎన్‌.అంజి రెడ్డితోపాటు ఎంపీఆర్‌ సీఐ చందాశ్రేఖర్‌, ఎస్సై సాయికిరణ్‌, సిబ్బంది యాదగిరి రాజు, యాదగిరి, మహేష్‌, రజనీకాంత్‌, అశ్విన్‌, వాసు, ప్రభు, రాహుల్‌ ఉన్నారు. గంజాయిని పట్టుకున్న సిబ్బందిని ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్ మెంట్‌ డైరెక్టర్‌ విబి కమలాసన్‌రెడ్డి, జాయింట్‌ కమిషనర్‌ ఖురేషి, అసిస్టెంట్‌ కమిషనర్‌ పి. ప్రణవీ అభినందించారు. 


Similar News