భూ వివాదంలో రైతు ఆత్మహత్యాయత్నం

భూ వివాదమై రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నంకు పాల్పడిన ఘటన కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో చోటుచేసుకుంది.

Update: 2024-07-04 14:53 GMT

దిశ, కారేపల్లి : భూ వివాదమై రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నంకు పాల్పడిన ఘటన కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఉసిరికాయలపల్లికి పచ్చిపాల భద్రయ్య ఎకరన్నర భూమి సంబంధించి మూడు ఏండ్లుగా వివాదం నడుస్తుంది. తనకు చెందిన భూమిని శంకర్ నాయక్ ఆక్రమించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. పచ్చిపాల భద్రయ్య, పచ్చిపాల సోమయ్య, పచ్చిపాల రామయ్య, పచ్చిపాల మల్లయ్య అన్నదమ్ములు. వీరిలో పచ్చిపాల భద్రయ్య మినహా మిగతా వారు తమ వాటాలను

    ఆర్టీఐ మాజీ కమిషనర్‌ శంకర్‌నాయక్‌ కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. అధికారుల అండతో సర్వే నెంబర్లుకు బై నెంబర్లు వేసి పక్కనే ఉన్న పచ్చిపాల భద్రయ్యకు చెందిన 1.20 ఎకరాల భూమిని సైతం కొనుగోలు చేసినట్లు అక్రమించాడని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. ఈ విషయమై ఇరు వర్గాలు కోర్టును సైతం అశ్రయించి ఇంజక్షన్‌ ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఈక్రమంలో పచ్చిపాల భద్రయ్యకు చెందిన భూమిని కొందరు ట్రాక్టర్లతో దున్నుతుండగా పచ్చిపాల భద్రయ్య, అతని భార్య భాగ్యమ్మ అడ్డుకున్నారు. తనకు న్యాయం జరగటం లేదంటూ చేనులోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గొడవ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఉసిరికాయలపల్లి గ్రామస్తులు భద్రయ్యను ఆసుపత్రికి తరలించారు.


Similar News