తూములో ఇరుక్కొని వ్యక్తి మృతి..

వైరా నది పై మధిర నుండి మడుపల్లి వెళ్లేందుకు తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు పై ద్విచక్ర వాహనదారుడు వెళ్లే క్రమంలో వాహనదారుడు కిందపడి తూములో ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.

Update: 2024-07-08 16:53 GMT

దిశ మధిర : వైరా నది పై మధిర నుండి మడుపల్లి వెళ్లేందుకు తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు పై ద్విచక్ర వాహనదారుడు వెళ్లే క్రమంలో వాహనదారుడు కిందపడి తూములో ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగిళ్ళపాడు గ్రామానికి చెందిన పోశెట్టి రమేష్ మధిర నుండి తన స్వగ్రామానికి వెళ్లేందుకు వైరా నది పై తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు మార్గాన వెళుతున్నారు.

ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనం అదుపుతప్పి నీటిలో పడిపోయి రమేష్ తూములో ఇరుక్కుపోయాడు. తూము గుండా నీరు ప్రవహించడంతో ఊపిరాడక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న మధిర పట్టణ పోలీసులు ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకులు సహాయంతో రమేష్ మృతదేహాన్ని తూము నుండి, నీట మునిగిన ద్విచక్ర వాహనాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Similar News